Switch to English

డీజే టిల్లు రివ్యూ: అక్కడక్కడా మెప్పిస్తాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
Movie డీజే టిల్లు
Star Cast సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ
Director విమల్ కృష్ణ
Producer సూర్యదేవర నాగ వంశీ
Music శ్రీచరణ్ పాకల, థమన్ ఎస్(బ్యాక్గ్రౌండ్ స్కోర్)
Run Time 2 Hr 08 Mins
Release ఫిబ్రవరి 12, 2022

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన సినిమా డీజే టిల్లు. ట్రైలర్ తో విపరీతంగా ఆకర్షించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

టిల్లు (సిద్ధు) ఒక చిన్నపాటి డీజే. ఏవో చిన్న చిన్న డీజే ఈవెంట్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన ఏరియాలో టిల్లు చాలా ఫేమస్. ఒకరోజు నేహా శెట్టిని కలిసి తన మీద మనసు పారేసుకుంటాడు. వాళ్లిద్దరూ ఆ తర్వాత రిలేషన్ షిప్ లోకి వెళ్తారు.

ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల తర్వాత ఒక మర్డర్ కేసులో టిల్లు ప్రధాన నిందితుడిగా మారతాడు. అరెస్ట్ కూడా అవుతాడు. అసలు ఈ మర్డర్ ఏంటి? అందులో టిల్లు ఎందుకు నిందితుడిగా మారాల్సి వచ్చింది? అసలు నిందితుడు ఎవరు అన్నది చిత్ర ప్రధాన కథాంశం.

పెర్ఫార్మన్స్:

సిద్ధు జొన్నలగడ్డ ఒక టాలెంటెడ్ నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ద్వారా మరోసారి తనలోని టాలెంట్ ను బయటకు తీసాడు. తెలంగాణ స్లాంగ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని అంశాల్లో సిద్ధు మెప్పించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడని చెప్పాలి. హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి రాణించింది. తను డీసెంట్ గా చేసింది. నర్రా శీను, ప్రిన్స్, బ్రహ్మాజీ పోషించిన పాత్రలు నవ్వులు పూయిస్తాయి. మిగతా అందరూ కూడా తమ తమ పరిధుల మేరకు రాణించారు.

సాంకేతిక నిపుణులు:

సిద్ధు జొన్నలగడ్డతో కలిసి విమల్ కృష్ణ ఈ చిత్రానికి కథ అందించాడు. ఇద్దరూ కలిసి డీజే టిల్లుకి మంచి సెటప్ ను సెట్ చేసారు. ముఖ్యంగా చిత్ర ఫస్ట్ హాఫ్ లోనే మెజారిటీ కామెడీ ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. దర్శకుడిగా విమల్ కూడా ఫస్ట్ హాఫ్ ను బాగా హ్యాండిల్ చేసాడు. అయితే సమస్య అంతా సెకండ్ హాఫ్ తోనే వచ్చింది. ఇక్కడ సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం మెయిన్ మైనస్ గా మారింది.

ఫస్ట్ హాఫ్ అదరగొట్టి, సెకండ్ హాఫ్ పరంగా డల్ అయిన సినిమాల కోవలోకే డీజే టిల్లు కూడా వెళ్తుంది. ఈ చిత్రానికి సంబంధించి బలమైన స్టోరీ ప్లాట్ లేకపోవడం దీనికి ప్రధాన మైనస్ పాయింట్ గా నిలిచింది.

శ్రీ చరణ్ పాకల సంగీతం బాగుంది. డీజే టిల్లు, పటౌడీ పిల్ల సాంగ్స్ బాగున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా సాగింది. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • టిల్లు పాత్ర చిత్రణ, సిద్దు పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • ఫస్ట్ హాఫ్ లో కామెడీ

నెగటివ్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ
  • బలమైన కథ లేకపోవడం
  • స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం

విశ్లేషణ:

డీజే టిల్లు పర్వాలేదనిపించే కామెడీ డ్రామా. సిద్ధు పెర్ఫార్మన్స్ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. హాయిగా సాగిపోయే ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకుంటే ఇబ్బంది పడాలి కానీ లేకపోతే డీజే టిల్లు ఒకసారి చూడవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...