Switch to English

గుడివాడలో సంక్రాంతి స్పెషల్ డెన్: దోపిడీ అన్-లిమిటెడ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ అంటే కోడి పందాల హంగామా మాత్రమేనా.? అంటే, అలా ప్రొజెక్ట్ అయిపోయింది మరి. వందల కోట్ల ‘యాపారం’ ఈసారి కూడా జరిగింది. కోవిడ్ భయాల్ని పక్కన పెట్టి, రికార్డు స్థాయిలో జనం పందెం గిరుల వద్ద కనిపించారు.. కనీ వినీ ఎరుగని రీతిలో సొమ్ములు చేతులు మారాయి.

కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లోనూ ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలోనే ‘గ్యాంబ్లింగ్’ జరిగింది. కోడి పందాలు, గుండాట, పేకాట శిబిరాలు.. అబ్బో, ఆ కొక్కే వేరప్పా. ఇవన్నీ ఓ యెత్తు, కృష్ణా జిల్లా గుడివాడలో వేసిన కాసినో డెన్ ఇంకో యెత్తు.

పైకి సాధారణ టెంట్ అయినా, లోపల సకల సౌకర్యాల్నీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఒక్కసారి ఈ టెంట్‌లోకి అడుగు పెడితే, ఆ ప్రపంచం మరో స్థాయిలో కనిపిస్తుందట. అచ్చం విదేశాల్లో వున్నట్టో లేదంటే గోవా కాసినోలో వున్నట్టో అనుభూతి కలుగుతుందట. ‘అట’ ఏమిటి.? దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చేస్తేనూ.!

లోపలికి వెళ్ళినవాళ్ళలో చాలామంది జేబులు గుల్ల చేసుకుని బయటకు వచ్చారట. లక్షలు కాదు, కోట్లు చేతులు మారాయట ఈ హై టెక్నాలజీ టెంట్ల కింద. ఇంతకీ, వీటిని నిర్వహించిందెవరు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. కానీ, సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ మాత్రం మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇది కనీ వినీ ఎరుగని వ్యవహారమేమీ కాదనీ, గతంలోనూ జరిగిందనీ.. అయితే, ఈసారి గతంలో కంటే కాస్త భిన్నంగా, చాలా హై ఫై తరహాలో నిర్వహించారనీ అంటున్నారు. ‘అబ్బే, మాకేంటి సంబంధం.?’ అంటూ అధికార పార్టీ నేతలు తమపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నా, తెరవెనుక మాత్రం అదికార పార్టీ ఈ కాసినోల నిర్వహణతో కోట్లు వెనకేసుకుందన్న గుసగులైతే ఆగడంలేదు.

ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మాత్రం బాగా అభివృద్ధి చెందినట్టుంది. కాసినోలు మాత్రమే కాదు, కాసనోవాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంక్రాంతికి పండగ చేసుకున్నట్టు వినికిడి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...