Switch to English

జగన్ పాలనలో ‘కమ్మ’దనం కష్టమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

చంద్రబాబు ఓటమి వల్ల ఎక్కువ నష్టం ఎవరికి జరిగిందని విశ్లేషిస్తే.. ఆయన సొంత సామాజిక వర్గానికేనని స్పష్టం అవుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన క్యాబినెట్‌లో ఆయనతోపాటు.. దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్‌, పుల్లారావు, పరిటాల సునీత.. తదుపరి లోకేష్‌.. ఇలా మొత్తం 6 గురు కమ్మవారు ప్రాతినిధ్యం వహించారు. ఇదికాక.. విప్‌గా చింతమనేని, స్పీకర్‌గా కోడెల ఉండేవారు. కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో, డైరెక్టర్లుగా.. దేవాలయ, గ్రంధాలయ సంస్థల్లో.. కీలకమైన ప్రభుత్వ పదవుల్లో, యూనివర్సిటీల్లో, ఏపీపీఎసీ చైర్మన్‌ పదవులు.. ఇలా కొన్ని వేల ప్రభుత్వ పదవుల్లో చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి భారీవాటా ఇచ్చారు. కాంట్రాక్టులు, నామినేషన్‌ పనుల్లోనూ సింహభాగం వారిదే. కొన్ని పత్రికలు, చానెళ్లు బాగా లాభపడ్డాయి. ఐదేళ్లూ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా సాగిపోయింది.

టీడీపీ ఓటమి చెంది.. వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో.. మరో ఐదేళ్లపాటు రాజ్యమేలాలనుకొన్న ఆ వర్గానికి కష్టకాలం దాపురించింది. జగన్‌ క్యాబినెట్‌లో ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. విప్‌ పదవుల్లో ఒక్కటీ లభించలేదు. గత నామినేటెడ్‌ పోస్ట్‌లన్నీ ఇవాళో, రోపో రద్దు కానున్నాయి. చంద్రబాబు అస్మదీయులు నామినేషన్‌ మీద అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకొనే అవకాశం లేకుండా పోయింది.

మిగతా సామాజిక వర్గాల పరిస్థితిని విశ్లేషిస్తే గతం కంటే మెరుగ్గానే ఉన్నట్లు కనపడుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి గత ఐదేళ్లూ గడ్డుకాలం ఎదురైంది కనుక జగన్‌ పాలనలో ఈసారి వారు లాభపడతారు. కాపులకు లోగడ మాదిరిగానే 5 మంత్రి పదవులు దక్కాయి కనుక వారికి నష్టం జరిగే అవకాశంలేదు. లాభపడిన మిగతా సామాజిక వర్గాలను చూస్తే.. మైనార్టీ, ఎస్టీ, బ్రాహ్మణ వర్గాలు ఉన్నాయి. మొత్తం మీద బీసీలకు గత ఐదేళ్ల కంటే మేలే జరుగుతుంది. కీలకమైన స్పీకర్‌ పదవి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు దక్కింది.

చంద్రబాబు వల్ల గత ఐదేళ్లుగా లాభపడిన కమ్మ కులస్థులు.. రాబోయే ఐదేళ్లూ గతంలో మాదిరిగా అన్నింటా తామే ఉండే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏదోఒక కులానికి.. అదికూడా సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న వర్గానికి లాభం చేకూరిస్తే అసలుకే మోసం వస్తుంది. మిగతా కులాలు తిరగబడతాయి. ఇపుడు ఏపీలో జరిగింది అదే.

చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక సామాజిక వర్గాలు జగన్‌కు చేరువయ్యాయి. అధికారంలో అందరికీ సముచిత వాటా ఇవ్వాలి. కానీ, వండింది అంతా మనమే తినాలి.. అనే ధోరణి ప్రదర్శిస్తే.. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. అందుకేనేమో.. జగన్‌ తన సొంత సామాజిక వర్గానికి అధికారంలో ఎక్కువ వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. చివరివరకూ జగన్‌ పదవుల పంపకంలో ఇదే సమతుల్యత పాటించాలి. లేకుంటే చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవమే ఎదురవుతుంది. ఒకసారి అధికారం కోల్పోతే.. దానిని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం!

Related Posts

జగన్‌ హయాంలో సర్కారీ స్కూళ్ళు హుళక్కే

బాలయ్య తనయుడు మోక్షజ్ఞకి ‘ఆ’ ఉద్దేశ్యం లేదా.?

జగన్‌కి స్వామీజీ ఆశీస్సులు.. సింగర్‌ చీవాట్లు

చంద్రబాబు.. హిమాలయాల నుంచి కిందకు దిగారు

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...