Switch to English

జనసేన ఓటమి .. మెగాస్టార్‌ అభిమానులకు సంతోషం దేనికి ?!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

రాజకీయాలకు అతీతంగా మెగాస్టార్‌ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తన అభిమానులు తనను ముఖ్యమంత్రి చేస్తారనే అభిప్రాయంతో మెగాస్టార్‌ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీ 2009లో పోటీ చేసినపుడు 74 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలిగారు. అంటే, చిరంజీవి అభిమానుల్లో చాలామంది పీఆర్పీకి ఓట్లు వేయలేదు. దానికి కారణం ఆయన మీద వ్యతిరేకత కాదు.. తమ రాజకీయ ప్రాధాన్యతలు వేరుకనుక వేరే పార్టీలకు ఓట్లు వేశారు. ఊహించినట్లు జరగకపోవడంతో చిరంజీవి కొద్ది కాలానికే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

కాగా, ఈసారి జరిగిన ఎన్నికల సభలలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ.. ”నేను మా సొంత అన్నయ్యనే ఎదిరించాను” అంటూ అదేదో గొప్ప విషయంగా చెప్పుకోవడాన్ని మెగాస్టార్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అన్నను తక్కువ చేసి తమ్ముడు మాట్లాడుతున్నాడని అందరూ బాధపడ్డారు. సందర్భం ఏదైనా పవన్‌ కళ్యాణ్‌ ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయ పడ్డారు.

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేముందు ఆ నిర్ణయాన్నిఎక్కువ మందితో చర్చించలేదన్నది పవన్‌ కళ్యాణ్‌ అభియోగం. అదే నిజమైతే.. 2014లో తన ఇంటికి చంద్రబాబు వచ్చి సపోర్ట్‌ చేయమని అడగగానే.. మరోమాట మాట్లాడకుండానే ఏకపక్షంగానే జనసేన మద్ధతు టీడీపీకేనని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడమే కాకుండా.. ప్రచారం కూడా చేశారు.

తెలుగుదేశంతో విభేదించి సొంతంగానే పోటీ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ నిశ్చయించుకున్నప్పుడు.. జనసేనలో చేరి పని చేయడానికి పీఆర్పీకి చెందిన వందలాది మంది సిద్ధమయ్యారు. కానీ, వారెవర్నీ పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీలోకి చేర్చుకోలేదు. పైగా, తన అన్నకు సన్నిహితంగా మెలిగిన వారిని పర్సనల్‌గా టార్గెట్‌ చేశారు. ఇది మెగాస్టార్‌ అభిమానులకు రుచించలేదు. పరోక్షంగా ‘అన్న చిరంజీవి’ తప్పు చేసినట్లు.. ఆ తప్పును తను చేయదల్చుకోలేదన్నట్లు పవన్‌ కళ్యాణ్‌ వ్యవహార శైలి సాగింది.

మొత్తం మీద అనేక తప్పులు, పొరపాట్ల కారణంగా జనసేన ఓడిపోయింది. 2009లో సొంతంగా పోటీ చేసిన పీఆర్పీకి 18 సీట్లు వస్తే.. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేనకు 1 సీటు మాత్రమే వచ్చింది. ఓట్లు శాతంగా చూస్తే పీఆర్పీకి 19% ఓట్లు లభిస్తే పవన్‌ కళ్యాణ్‌కు 9% ఓట్లు మాత్రమే దక్కాయి. అదికూడా వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.

దీనినిబట్టి ప్రజల్లో మెగాస్టార్‌కి ఉన్న ఆదరణ.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు లేదని స్పష్టం అయింది. తొందరపడి అన్నను తక్కువ చేసి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడటం కూడా చాలామందికి రుచించలేదు. ప్రజల్లో చిరంజీవికే ఎక్కువ పలుకుబడి ఉందని వెల్లడి కావడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు లోలోపల సంతోషపడుతున్నారు! దటీజ్‌ మెగాస్టార్‌ !

Related Posts

జనసేనానికి సొంత నియోజకవర్గమెక్కడ!

ఈషా రెబ్బ లేటెస్ట్ ఫొటోస్

ఆర్జీవీ పంచ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌!

రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోషూట్

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...