Switch to English

జస్ట్ ఆస్కింగ్: తెలుగు నాట ఆ ప్రాజెక్టులు ఎంత భద్రం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది.. తప్పు నీదంటే, నీదంటూ అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటోన్న విషయం విదితమే. ‘అప్పుడు మీరేం చేశారు.?’ అన్న ప్రశ్న అధికార వైసీపీ నుంచి తెరపైకొస్తోందంటే, మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి.. అదే నిర్లక్ష్యాన్ని మేమూ కొనసాగిస్తున్నాం.. అన్నట్టుంది తప్ప, బాధ్యత కనిపించడంలేదు.

సరే, అన్నమయ్య ప్రాజెక్టు అనేది చాలా చిన్నది.. పోలవరం ప్రాజెక్టుతో పోల్చి చూసినప్పుడు. పోలవరం ప్రాజెక్టుకి ఆ మధ్య భారీ వరద వస్తే, డయాఫ్రమ్ వాల్ కొంత భాగం దెబ్బ తినేసిందని సాక్షాత్తూ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్న విషయం విదితమే.

ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు ఎంత భద్రం.? పోలవరం ప్రాజెక్టుకి ప్రతి యేటా కనీ వినీ ఎరుగని స్థాయిలో వరద వచ్చి చేరుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టుకి దిగువన కాటన్ బ్యారేజీ వుంది. దాంట్లో నీటి నిల్వ చాలా చాలా తక్కువ. వచ్చిన వరదని వచ్చినట్లుగా కిందికి వదిలేయడం తప్ప మరో మార్గం లేదు. రికార్డు స్థాయిలో వరద నీటిని కిందికి వదిలేసే అవకాశం కాటన్ బ్యారేజీకి వుంది.

పోలవరం ప్రాజెక్టుకి నిల్వ సామర్థ్యమెక్కువ. మరి, అంతలా నీటిని నిల్వ చేశాక.. రికార్డు స్థాయిలో వరద వస్తే పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళనూ తొలుస్తోన్న ప్రశ్న. గోదావరి నదిపై పరిస్థితి ఇలా వుంటే, కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ సంగతి సరే సరి.

మొన్నామధ్య పులివెందుల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది.. చాలా నీరు వృధాగా పోయింది. కొన్నాళ్ళ క్రితం ప్రకాశం బ్యారేజీలోని ఓ గేటుకి పడవ అడ్డుపడింది. గేటు మూసే పరిస్థతి లేకుండా పోయింది. ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగిన ఘనకార్యాలే.

వందల వేల మంది కాదు, లక్షలాది మంది ప్రజల జీవితాలు ఆధారపడి వున్నాయి ఈ ప్రాజెక్టుల మీద. ఏ చిన్న తేడా వచ్చినా, ఆస్తి నష్టం సంగతి దేవుడెరుగు.. ప్రాణ నష్టం కనీ వినీ ఎరుగని స్థాయిలో వుంటుంది. తస్మాత్ జాగ్రత్త.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...