Switch to English

గులాబీ పార్టీ ఆర్తనాదాలు.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని వెనకటికి ఓ సామెతలాంటిదొకటుంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ వెంట నడిచిన నాయకుల్ని కాదని, ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి వచ్చి చేరిన వలస పక్షులకి పెద్ద పీట వేస్తూ వచ్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

మాజీ ముఖ్యమంత్రి.. అంటే, సారుకి కోపమొస్తుంది. అందుకే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.. అని కేసీయార్‌ని సంబోదిస్తోంది.. గులాబీ మీడియా.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. కేసీయార్, మాజీ ముఖ్యమంత్రే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

ఇప్పుడేమో, గులాబీ పార్టీ నుంచి ఒకరొకరుగా ఇతర పార్టీల్లోకి దూకేస్తున్నారు. గతంలో గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులెలా దూకారో, ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి అటువైపు జంప్ చేస్తున్నారంతే. ఎక్కడ అధికారం వుంటే, అక్కడికి రాజకీయ నాయకులు జంప్ చేయడం.. మోడ్రన్ పాలిటిక్స్‌లో భాగం. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి వీల్లేదు.
రాజకీయ పార్టీలు, నాయకులు అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో.. ఏదైనా మామూలే.! అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జస్ట్ వంద రోజుల్లోనే గులాబీ పార్టీ ఇంతలా అయోమయానికి గురవడమేంటి.? టిక్కెట్లు దక్కించుకున్న నాయకులు, వద్దు మహాప్రభో.. అని పార్టీ నుంచి జంప్ చేసెయ్యడమేంటి.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ పార్టీ చాలా చాలా తప్పులు చేసింది. ఒక్క ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగమంతా దిగి, చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన విజయం సాధించే దుస్థితి ఎందుకొచ్చింది.? అంతకు ముందు ఓడిపోయే పరిస్థితిని ఎందుకు కొనితెచ్చుకుంది.?

వున్నపళంగా గులాబీ బాస్, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతేగానీ, ఇంకా కేసీయార్ తనయుడు కేటీయార్, పార్టీ దూకేస్తున్న నేతల మీద సెటైర్లు వేసుకుంటూ వెళితే ఉపయోగం లేదు. తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరాక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం తప్పులు చేశామన్నది తమను తామే ప్రశ్నించుకోవాలి.

అన్నిటికన్నా ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి ఏం సాధించారో గులాబీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. లేనిపక్షంలో, త్వరలో.. అతి త్వరలో.. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతైపోవడం ఖాయం.

వున్నపళంగా భారత్ రాష్ట్ర సమితి పేరుని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చెయ్యాలన్న డిమాండ్లు గులాబీ పార్టీలో చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ ఏమైనా కొస ఊపిరితో మిగిలితే.. పార్టీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే తీసుకోవడం ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...