Switch to English

పవన్ కళ్యాణ్ నయా రాజకీయంతో వైసీపీ కకావికలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో రోడ్లెందుకు పాడైపోయాయ్.? పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.? పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కోడి కత్తి కేసు ఏమైంది.? పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. రాష్ట్ర రాజధాని పరిస్థితేంటి.? రాష్ట్రం అప్పుల కుప్పగా ఎందుకు మారిపోయింది.? ఇలా ఏ ప్రశ్న అడిగినా, అన్నిటికీ అధికార పార్టీ నుంచి జనసేన మీదకు దూసుకొచ్చేది ఒకటే ప్రశ్న.. అదే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని.

కోడి కత్తి కేసు ఎన్ఐఏ విచారిస్తోంది.. అంతర్వేది రధం దగ్ధం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేశాం.. సుగాలి ప్రీతి కేసు కూడా సీబీఐ విచారణకే ఇచ్చేశాం.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని సీబీఐ విచారిస్తోంది.. ఇదీ అధికార పార్టీ చెప్పే మాట. ఇంకెందుకు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, వివిధ వ్యవస్థలు వున్నట్టు.? ఇది సామాన్యుడి ప్రశ్న.

నిన్న వైసీపీ నుంచి చాలామంది నేతలు, పవన్ కళ్యాణ్ మీద విమర్శల కోసం వచ్చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటంటే, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మీద ప్రశ్నించడం. ఈ క్రమంలో కొన్ని రాజకీయ విమర్శలు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చాయి, వస్తాయి కూడా.

మంత్రి కన్నబాబు విషయాన్నే తీసుకుందాం.. సొంత జిల్లాలో రోడ్ల దుస్థితికి ఓ మంత్రిగా బాధ్యత తీసుకోవాలి కదా.? ‘నాకేంటి సంబంధం.?’ అన్నట్టు రోడ్ల దుస్థితి గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడేశారు.. అందులో కులాల ప్రస్తావన తీసుకొస్తూ, ముఖ్యమంత్రి కులాలకూ, మతాలకూ అతీతుడంటూ ప్రవచనాలు చెప్పేశారు కన్నబాబు.

రెండున్నరేళ్ళగా తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లు నరకానికి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఎన్నో ప్రాణాలు దిక్కుమాలిన రోడ్ల కారణంగా గాల్లో కలిసిపోయాయ్. రెండు చోట్లా ఓడిపోయిన ఓ పార్టీ అధినేత.. రోడ్డెక్కి శ్రమదానం చేసినప్పుడు, అధికార పార్టీ నేతలెందుకు చేయకూడదు.? శ్రమదానం చేయనక్కర్లేదు, ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయిస్తే సరిపోతుంది. కానీ, అలా చెయ్యరుగాక చెయ్యరు.

సంక్షేమ పథకాలు ‘బిచ్చంలా పారేస్తున్నాం’.. జనం చచ్చినట్లు తమకే మద్దతిస్తారన్న అహంకారం అధికార పార్టీలో పెరిగాక.. ప్రభుత్వంలో వున్నవారు, ప్రజల కోసం ఎందుకు పని చేస్తారు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...