Switch to English

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

91,428FansLike
56,273FollowersFollow

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయనకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా వున్నారట. భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, హోర్డింగులు, గజ మాలలూ.. అబ్బో, ఆ కిక్కే వేరప్పా.. అంటూ గోరంట్ల అభిమానులు నానా యాగీ చేస్తున్నారు.

గోరంట్ల మాధవ్ ఏమైనా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారా.? గోరంట్ల మాధవ్ ఏమైనా హిందూపురం నియోజకవర్గానికి ఏదన్నా జాతీయ సంస్థను తీసుకొస్తున్నారా.? ఓ మెడికల్ కాలేజ్ లేదా ఓ ఇంజనీరింగ్ కాలేజీ.. లేదంటే, స్టేడియం లాంటిదేదైనా కేంద్రాన్ని ఒప్పించి తెచ్చారా.?

ప్చ్.. ఏమీ లేదు. జస్ట్ ఆయన ఇటీవల ఓ ఘనకార్యం చేశారు. అదీ, టీడీపీ అను‘కుల’ మీడియాని బూతులు తిట్టారు. కమ్మ సామాజిక వర్గాన్ని తూలనాడారు. అన్నిటికీ మించి, ఓ న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కున్నారు. అద్గదీ అంతకన్నా ఘనకార్యం ఇంకేముంటుంది.?

ఒకప్పుడు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడమంటే సిగ్గుపడాల్సిన విషయం. నైతికత కోణంలో, పదవులకు రాజీనామా చేసేవాళ్ళు ప్రజా ప్రతినిథులు. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి వస్తే, అదో ఘనకార్యం. హత్య చేసి డెడ్‌బాడీని డోర్ డెలివరీ చేస్తే అది ఇంకో ఘనకార్యం. అత్యాచారాలు చేస్తే, అది ఇంకో ఘనకార్యం.!

ఇదీ ఇలా బోల్డన్ని కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. ఏం చేయగలరు జనం.? సోషల్ మీడియాలో టైమ్ పాస్ కోసం ప్రశ్నించడం తప్ప.? ‘సర్క్యులేట్ అవుతోన్న వీడియో ఒరిజినల్ కాదు..’ అన్నది పోలీసుల వెర్షన్. ఒరిజినల్ దొరికితే తప్ప, ఫోరెన్సిక్‌కి పంపలేమని పోలీసులు తేల్చారు. దానర్థం, గోరంట్ల మాధవ్‌కి క్లీన్ చిట్ దక్కినట్లు కాదు. కానీ, ఆయన తనకు క్లీన్ చిట్ దక్కినట్లే భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే తనకు ఘనంగా స్వాగతం పలికే ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లున్నారు. పైగా, వైసీపీ కూడా.. ఓ ఘనాపాటీ రాష్ట్రానికి పెద్ద ఘనకార్యం చేసొస్తున్నారన్నట్లుగా హంగామా చేస్తోంది. తప్పదు, ఇది బులుగు ప్రజాస్వామ్యం.. ఇలాంటివి భరించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...

బూతుల షో నుండి బూతులు మాయం అవ్వబోతున్నాయట

కరణ్ జోహార్ టాక్ షో అనగానే ఈ మధ్య బూతులు ఎక్కువ గుర్తొస్తున్నాయి. వచ్చిన సెలబ్రిటీల యొక్క శృంగార జీవితం గురించి పదే పదే అడుగుతూ వారి శృంగార అనుభవాలను పంచుకోవాలంటే కరణ్...

బిగ్‌ బాస్ 6 గీతూ రాయల్‌ గురించి ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గలాట గీతూ రాయల్ జీవితం ప్రత్యేకమైంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతోంది. టిక్ టాక్ స్టార్ గా...

గాడ్‌ఫాదర్ ఈవెంట్‌ కి వస్తూ అభిమాని మృతి .. చిరు స్పూర్తితో కళ్లు ధానం

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల అనంతపురంలో జరిగిన విషయం తెలిసిందే. రాయలసీమ మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో...

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...