ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే దేశభక్తితో ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తోంది.
బైక్ ర్యాలీలు, అత్యంత పొడవైన జెండాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ హంగామా మామూలుగా లేదు. అంతా బాగానే వుందిగానీ, స్వేచ్ఛ.. స్వాతంత్ర్యం.. ఇవి సామాన్యులకు సమానంగా దక్కుతున్నాయా.. అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
స్వేచ్ఛ ఎవరికి.? ఆర్థిక నేరస్తులకి.! స్వాతంత్ర్యం ఎవరికి.? రాజకీయ నేరస్తులకి.! ఇలా నిట్టూర్పులు ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి. జాతీయ జెండా ఎగురవేయబోయే ప్రముఖుల్లో ఎంతమంది నేరస్తులున్నారు.? అన్నది ప్రజలకి తెలుసు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. నేరస్తులు నీతులు చెబుతోంటే, వాటిని జనం భరించాల్సి వస్తోంది. చాలాకాలంగా నడుస్తోన్న తంతు ఇది.
హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. అత్యాచారం కేసుల్లో నిందితులుగా విచారణల్ని ఎదుర్కొంటున్నవారు.. ఇలా చెప్పుకుంటూ పోతే, నేరమయ రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటోళ్ళు ప్రజా ప్రతినిథులుగా మారి, స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ, సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?
జాతీయ జెండా.. ఇలాంటివాళ్ళని చూసి మౌనంగా ఎగురుతుంటుంది. ఎందుకంటే, ఇది ఆ జెండాకీ కొత్త కాదు. న్యాయస్థానాల్ని ఏమార్చే రాజకీయ నాయకులు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్న పాలకులు.. వెరసి, స్వతంత్ర భారతావనికి అర్థం మారిపోయింది.. స్వేచ్ఛకీ అర్థం మారిపోయింది.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్ క్రాస్ చేస్తే జరీమానా కట్టి తీరాల్సిందే. కానీ, హత్య చేసిన రాజకీయ నాయకుడికి ఏళ్ళు గడిచినా శిక్ష పడదు. వేల కోట్లు దోచేసిన ఆర్థిక నేరస్తుడికీ శిక్ష పడాలంటే దశాబ్దాల కాలం పడుతుంది.. పోనీ, అప్పుడన్నా శిక్ష ఖచ్చితంగా పడుతుందని చెప్పలేం.
మరి, మన స్వాతంత్ర్యానికి అర్థమేంటి.? అప్పట్లో తెల్లదొరలు పీడించారు.. ఇప్పుడు మన రాజకీయ దొరలే మనల్ని పీడిస్తున్నారు. పెద్దగా తేడా ఏం లేదు.!
631326 146417You are the best, Its posts like this that maintain me coming back and checking this web site regularly, thanks for the info! 322037
253358 765351Hello. Cool article. Theres an concern with the website in internet explorer, and you might want to test this The browser may be the marketplace chief and a large element of other folks will miss your fantastic writing due to this issue. 758488
10198 311658Spot ill carry on with this write-up, I truly believe this website requirements a great deal much more consideration. Ill oftimes be once more to see far a lot more, numerous thanks that information. 65429
335903 72084You completed quite a few nice points there. I did a search on the problem and discovered practically all men and women will have the same opinion with your weblog. 894702
776198 164600Woh I enjoy your articles , saved to favorites ! . 3949