Switch to English

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

91,428FansLike
56,274FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ నియోజకవర్గాల్నీ గెలిచేసుకుంటామని అధికార వైసీపీ చెబుతోంది.

ఇంకోపక్క తమ ఓటు బ్యాంకు 50 శాతం నుంచి 57 శాతానికి పెరిగిందని వైసీపీ చెప్పుకుంటోంది. వైసీపీ అనుకూల మీడియా ఇదే ప్రచారం గట్టిగా చేస్తోంది. పెయిడ్ మాఫియా కదా, ఇంతకన్నా భిన్నంగా ఎలా వుంటుంది.? అంతిమంగా, ఆ రోజు ఓట్లేసే సమయానికి ఓటర్ల ‘నాడి’ ఎలా వుంటుందన్నదానిపై ఏ రాజకీయ భవిష్యత్తు అయినా ఆధారపడి వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నది వైసీపీ అనుకూల మీడియానే చెబుతున్నమాట. సంక్షేమ పాలన ఎలా జరగుతోంది.? పెంచుతున్న పన్నులు, చేస్తున్న అప్పులతోనే కదా.? ఈ విషయాన్ని వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు.

50 శాతం ఓట్లు దక్కించుకుంటే 151 సీట్లు వచ్చినప్పుడు, 57 శాతం ఓట్లు వస్తే 175 సీట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పలు జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్న విషయమేంటంటే, వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 18 లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని. అలా ఎలా.? 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ సీట్లూ వైసీపీ కైవసం అయిపోవాలి కదా, 57 శాతం ఓటు బ్యాంకు అంటే.?

వైసీపీ ఓటు బ్యాంకు తగ్గి, టీడీపీ ఓటు బ్యాంకు పెరిగిందన్న విషయాన్ని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు గురించిన చర్చ చాలా జాతీయ సంస్థల సర్వేల్లో కనిపించడంలేదు. అది కూడా పరిగణనలోకి తీసుకుంటే, ఖచ్చితంగా వైసీపీకి రానున్న ఎన్నికల్లో చాలా చాలా పెద్ద దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.

ఒకే ఒక్క శాతం ఓటు.. రాజకీయాల్ని మార్చేస్తుంది. 18 లోక్ సభ సీట్లకీ 7 లోక్ సభ సీట్లకీ మధ్య ఓటు శాతం తేడా చాలా చాలా తక్కువుగా వుంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఆ లెక్కన, ఎన్నికల నాటికి అరశాతం ఓటు బ్యాంకు అటూ ఇటూ అయినా, తక్కెడ లెక్కలు మారిపోతాయ్.

కానీ, అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ, కళ్ళకు ‘అధికారం’ అనే గంతలు కట్టుకునే వుంటాయి. ఆ గంతల్ని కట్టేది కూడా అధికార పార్టీ అను‘కుల’ మీడియా సంస్థలే అవుతాయ్. అప్పట్లో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. అంతే తేడా.! మిగతాదంతా సేమ్ టు సేమ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ...

కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ చేయించిన వంటల లిస్ట్‌ ఇదిగో.. క్వింటాల్లో కాదు టన్నుల్లో!

కృష్ణంరాజు మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన మృతి చెందిన సమయంలోనే సొంత ఊరు మొగల్తూరు లో భారీ ఎత్తున సంస్మరణ సభ నిర్వహించాలని భావించారు. కాస్త ఆలస్యంగా సంస్మరణ...

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2’ USAలో...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నేటి నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. లైన్ దాటితే బాదుడే!

నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. ఆపరేషన్ రోప్ (అడ్డంకెల పార్కింగ్ మరియు ఆక్రమణల తొలగింపు)ను ట్రాఫిక్ పోలీసులు ముమ్మరం చేశారు. ఫుట్ పాత్ మీద ఉన్న...