Switch to English

నిమ్మగడ్డని చూసి వైఎస్సార్సీపీ ఎందుకు భయపడ్తోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

స్థానిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు ఏ స్థాయిలో అరాచకాలు చేశారో.. వాటన్నిటికీ సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు సాక్ష్యాలుగా వున్నాయి. మహిళలపై దాడులు, నామినేషన్లు వేస్తామంటే బెదిరింపులు.. వెరసి, స్థానిక ఎన్నికల వ్యవహారం ఓ ప్రసహనంలా సాగింది. మధ్యలో కరోనా వైరస్‌ రావడంతో స్థానిక ఎన్నికలకు కాస్త బ్రేక్‌ పడింది. ‘జనం ఛస్తే చావనీ.. స్థానిక ఎన్నికలు మాత్రం అయిపోవాలి..’ అనే భావనతో వున్నట్లు వైసీపీ నేతలు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై గుస్సా అయ్యారు.

అవును మరి, కరోనా ప్రమాదాన్ని ముందే అంచనా వేసి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. సరే, ప్రభుత్వం ఆర్డిరెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో కొత్త ఎస్‌ఇసిగా కనగరాజ్‌ ప్రమాణ స్వీకారం చేయడం, హైకోర్టు ఆ వ్యవహారాన్ని తప్పుపట్టడం.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడం.. ఇవన్నీ వేరే అంశాలు.

కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు నిమ్మగడ్డ అంటే భయపడుతోంది.? ‘ఏం నిమ్మగడ్డ ఏమన్నా బొచ్చు పీకుతాడా.?’ అని సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని ఓ ప్రెస్‌ మీట్‌లో వ్యాఖ్యానించారాయె. మరి, అంత గట్టి నమ్మకం ప్రభుత్వానికే వుంటే, నిమ్మగడ్డనే కొనసాగించవచ్చు కదా.! ప్రభుత్వానికి అవకాశం వుంది, సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

ఈలోగా అడ్డగోలు రాజకీయ విమర్శలు చేయడం ద్వారా తమ మైలేజ్‌ పెంచుకోవాలనుకుంటున్నారు విజయసాయిరెడ్డి లాంటి నేతలు. లేకపోతే, చంద్రబాబు డజను మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపారని విజయసాయిరెడ్డి ఆరోపించడమేంటి.? డజను కాదు కదా.. వెయ్యి మంది అడ్వొకేట్లను పంపినా.. అక్కడ జరగాల్సింది జరుగుతుంది తప్ప, ‘మంది బలం’ అక్కడ పెద్దగా పనిచేయదు. ఆ విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే బాగా తెలుసు.

ఇక, హైకోర్టులో నిమ్మగడ్డకు మద్దతుగా పిటిషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ వున్నారు.. రాజకీయ పార్టీలతో సంబంధం లేనివారూ వున్నారు. విజయసాయిరెడ్డికి అంత ధైర్యమే వుంటే.. నిమ్మగడ్డ వ్యవహారంలో అంత చిత్తశుద్ధే వుంటే.. కామినేని శ్రీనివాస్‌నీ, బీజేపీనీ విమర్శించగలగాలి. అప్పుడెప్పుడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీద నాలుగు విమర్శలు చేసి లైట్‌ తీసుకున్న విజయసాయిరెడ్డి, బీజేపీ అధిష్టానాన్ని ఈ విషయంలో ఇప్పుడు ప్రశ్నించగలరా.? ఆ ధైర్యం లేనప్పుడు, సోషల్‌ మీడియాలో ఎందుకు ఈ తాటాకు చప్పుళ్ళు.? టైమ్ పాస్‌ పబ్లిసిటీ స్టంట్లు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...