Switch to English

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్‌.. ఏది నిజం.?

ఎప్పుడో బ్రిటిష్‌ వారి హయాంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు జరిగాయి. కానీ, ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘జలయజ్ఞం’లో కీలక ప్రాజెక్టుగా మారినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుకి అవకాశం దక్కినా.. అప్పటికీ ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం మాత్రం వీడటంలేదు.

2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని గతంలో చంద్రబాబు సర్కార్‌ చెప్పుకుంది. కానీ, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు నెలలపాటు పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.. రివర్స్‌ టెండరింగ్‌ పుణ్యమా అని. అయితే, ఆ తర్వాత పనులు వేగం పుంజుకున్నాయట. ఈ మేరకు మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చిపడుతున్నాయి. మరి, ఈ కథనాల్లో వాస్తవం ఎంత.? ‘నేతి బీరకాయిలో నెయ్యి లాగానే..’ అంటున్నారు విశ్లేషకులు.

మరోపక్క, ముఖ్యమంత్రి అయ్యాక రెండో సారి పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించి, ఆ తర్వాత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నది తాజాగా ప్రభుత్వం చెబుతున్న మాట.

కాస్త అటూ ఇటూగా అయినా, 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికార పార్టీ కుండబద్దలుగొట్టేస్తోంది. కానీ, ఆ దిశగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం పోలవరం ప్రాజెక్టుకి రాలేదు. ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించి తీవ్రమైన ప్రతిబంధకంగా కన్పిస్తోన్న అంశం ‘పునరావాసం’. ఈ విషయమై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అదే మొదటి నుంచీ ప్రాజెక్టుని వివాదాల్లోకి నెట్టేస్తోంది.

సవరించిన అంచనాల్ని కేంద్రం ఇంతవరకు పూర్తిస్థాయిలో ఆమోదించలేదు. మరోపక్క, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చయిన లెక్కలపై రాష్ట్రానికీ – కేంద్రానికీ మధ్య ‘గ్యాప్‌’ కన్పిస్తోంది. పలుమార్లు కేంద్రం దృష్టికి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం (చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం) తీసుకెళ్ళినా ఆశించిన మేర కేంద్రం సహకరించని పరిస్థితి. మరెలా, 2021 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు...

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి,...

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...