Switch to English

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల భూ దందా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఓ రైతు, తన భూమిని స్థానిక వైసీపీ నాయకులు భూ దోపిడీకి పాల్పడుతున్నారంటూ వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఆరోపించడం కలకలం రేపుతోంది. బాధితుడు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం మరో ఆసక్తికరమైన అంశం. కడప జిల్లా మైదుకూరులోని దువ్వూరు మండలంలోగల ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషా అనే వైసీపీ కార్యకర్త, తనకు చెందిన ఒకటిన్నర ఎకరాల భూమిని స్థానిక వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి ఆక్రమించారనీ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.

‘జీవనాధారమైన భూమిని ఆక్రమించారు. న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయిస్తే, సీఐ కొండారెడ్డి కూడా నన్ను బెదిరిస్తున్నారు..’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు అక్బర్ బాషా. తనతోపాటు తన భార్యనీ దూషించారనీ, లాగి పడేశారనీ అక్బర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు న్యాయం జరగకపోతే, కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు అక్బర్ బాషా.

గతంలో కూడా కర్నూలు జిల్లాకి చెందిన ఓ మైనార్టీ వ్యక్తి.. ఇలాగే అధికార పార్టీ నేతలు, పోలీసు అధికారుల తీరుతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్న విషయం విదితమే. అయినా, అధికార పార్టీకి చెందిన నేతలు, అధికార పార్టీకి చెందిన వారి భూముల్ని సైతం కబ్జా చేస్తుండడం.. పోలీసులు కొందరికి వత్తాసు పలుకుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? సోషల్ మీడియాలో అక్బర్ బాషా వీడియో వైరల్ అవడంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. జిల్లా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతో, అధికారులు రంగంలోకి దిగి, అక్బర్ బాషా కుటుంబానికి న్యాయం చేస్తామంటున్నారు.

‘మేం చచ్చిపోతాం..’ అని కుటుంబ సమేతంగా సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తే తప్ప అధికార యంత్రాంగం కదలదా.? ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించదా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. విపక్ష నేతల అరెస్టు మీద పెట్టిన శ్రద్ధ, ప్రజా భద్రతపై పోలీసులు పెడితే అసలిలాంటి దుస్థితి ఎందుకొస్తుంది.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...