Switch to English

తేడా వస్తే వైసీపీ పరిస్థితేంటి మేస్టారూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

2009 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి. ‘ప్రజలు మాకు బొటాబొటీ మార్కులే ఇచ్చారు. మేం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ప్రజల ఆలోచనలు కొంత భిన్నంగా వున్నాయి. ఈ ఫలితాలతో మేం చాలా జాగ్రత్తగా వుండాల్సి వస్తుంది’ అని అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన విజ్ఞతని తెలియజేశాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం, ‘ప్రజారాజ్యం పార్టీ వల్లనే మేం ఓడిపోయాం..’ అని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. కుంటి సాకులు వెతుక్కోవడమంటే ఇదే మరి.

2014 ఎన్నికల నాటికి ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగినా, ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మాదే..’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా గట్టిగా చెప్పుకుంది. అప్పటికి జగన్‌కి వున్న వేవ్‌ కారణంగా, జగన్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అందరూ అనుకున్నారు. ‘బస్తీ మే సవాల్‌.. గెలిచేది మేమే.. ఎవరూ మా విజయాన్ని అడ్డుకోలేరు..’ అంటూ వైసీపీ నేతలు అప్పట్లో చేసిన హంగామాని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి కన్పిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో.

అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ‘మార్పు’ స్పష్టంగా కన్పిస్తోంది. ముందస్తు సర్వేలు ఏవీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేవు. అవన్నీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా వున్నాయి. ‘మోడీ వేవ్‌, దానికి తోడు పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ కలిసొచ్చి టీడీపీకి గెలిచింది’ అని 2014 ఎన్నికల్లో తమ ఓటమికి కారణాన్ని వెతుక్కున్న వైసీపీకి, ఈసారి పరిస్థితులు కొంత అనుకూలంగానే కనిపిస్తున్న మాట వాస్తవం.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అందుకు చాలా ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చన్న అభిప్రాయమొకటి బలంగా తెరపైకొస్తోంది. దానికి కారణమూ లేకపోలేదు. జనసేన పార్టీ ప్రభావం ఈసారి ఎన్నికలపై గట్టిగానే వుండబోతోంది. అదెంత? అన్నది ఇప్పటికైతే ఖచ్చితంగా అంచనా వేయలేం. కానీ, ఆ ప్రభావాన్ని ముందుగానే టీడీపీ, వైసీపీ ఫీల్‌ అవుతున్నాయి.

తాజాగా, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి, ‘మేమే అధికారంలోకి వస్తాం, ఆ విషయాన్ని మే 19వ తేదీనే ప్రూవ్‌ చేస్తాం..’ అంటున్నారు. ఫలితాలు వచ్చేది మే 23న. అప్పటిదాకా జనం నాడి ఏంటన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ముందస్తు సర్వేలు కావొచ్చు, ఎగ్జిట్‌ పోల్స్‌ కావొచ్చు.. ఇవన్నీ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు కావు. ‘అధికారంలోకి వచ్చేది మేమే..’ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న యాగీ చూస్తోంటే, ‘2014లో కూడా ఇలాగే చేశారు కదా, ఇంతకన్నా కొత్తగా వారి నుంచి ఏం ఆశించగలం?’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పినా అదొక లెక్క. ఫలితాల వెల్లడికి టైమ్‌ ఎక్కువ పట్టింది గనుక, పోలింగ్‌ ముగిశాక వైసీపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు ‘మేమే గెలుస్తాం..’ అని ధీమా వ్యక్తం చేయడం ఇంకో లెక్క. ఇంకో 8 రోజుల్లో ఫలితాలొచ్చేస్తాయ్‌, ఈ టైమ్‌లో ‘బస్తీ మే సవాల్‌’ అనడం హాస్యాస్పదమే అవుతుంది. మరీ ముఖ్యంగా, 2014 ఎన్నికల సమయంలో ఇలా అత్యుత్సాహం చూపి భంగపడ్డ వైసీపీ, ఈసారెందుకు ‘గత పాఠాల్ని’ గుర్తుకు తెచ్చుకోవడంలేదు? ఓడితే, ఈ ప్రగల్భాలన్నీ ఆ పార్టీ మెడకి చాలా గట్టిగా చుట్టుకుంటాయి. అధినేత, జనం ముందుకు వచ్చే పరిస్థితి కూడా వుండకపోవచ్చు. వైఎస్‌ జగన్‌ పాటిస్తున్న సంయమనంలో పదో వంతైనా పార్టీ నేతలు అలవర్చుకుంటే మంచిదేమో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...