Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: రఘురామకృష్ణరాజుకి ‘వై’ కేటగిరీ భద్రత

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, తాను అనుకున్నది సాధించేశారు. కేంద్రం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందారాయన. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి తనకు సమాచారం అందిందని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో తనకు ఆ భద్రత వస్తుందని అంటున్నారు రఘురామకృష్ణరాజు.

నిజంగానే ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కాబోతోంది. రాష్ట్రంలో తనకు భద్రత లేదనీ, సొంత పార్టీ నేతలే తనపై దాడులు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ని ఆశ్రయించారు.. కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ‘నేను దరఖాస్తు చేసుకుంటే అడిగినట్లుగా భద్రత ఇచ్చేయరు.. పరిస్థితిని సమీక్షిస్తారు. అందులో వాస్తవం వుంటేనే భద్రతను కల్పిస్తారు..’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం చూస్తోంటే, రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రానికి ఖచ్చితమైన అవగాహన వున్నట్లే కన్పిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు తనకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పిస్తే, ఆ వెంటనే ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్ళే అవకాశం వుంది.

వైసీపీలో గత కొంత కాలంగా రఘురామకృష్ణరాజు కలకలం సృష్టిస్తోన్న విషయం విదితమే. ‘బొచ్చులో నాయకత్వం’ సహా పలు ఆరోపణలు ఆయన ఆయన మీదున్నాయి. వైసీపీ అనుకూల మీడియా తన మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో, స్పీకర్‌కి తాను ఫిర్యాదు చేయడాన్ని వైసీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోయిందని, అప్పటినుంచే తనకి వ్యతిరేకంగా పార్టీలో కొందరు పావులు కదుపుతున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు.

ఇదిలా వుంటే, రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు తన దిష్టిబొమ్మల్ని తగలేస్తున్నా, తనను చంపేస్తామని హెచ్చరిస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడిక కేంద్ర బలగాల భద్రత లభించాక, సొంత నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు పర్యటిస్తే.. ఆ ఇంపాక్ట్‌ రాష్ట్ర రాజకీయాలపై ఎలా వుంటుందో ఏమోగానీ.. ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల ‘పవర్‌’ ఏమిటో నర్సాపురం రాజుగారు తనదైన స్టయిల్లో వైసీపీ అధిష్టానానికి రుచి చూపించగలిగారన్నది నిర్వివాదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

రాశి ఫలాలు: సోమవారం 08 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ఏకాదశి సా.5:22 వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: జ్యేష్ఠ ఉ.11:57 వరకు తదుపరి...

నాగార్జున ది ఘోస్ట్ చిత్రీకరణ పూర్తి

గత కొంత కాలంగా వరస పరాజయాలతో అక్కినేని నాగార్జున ఇబ్బందిపడుతున్నాడు. భారీ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నాగ్ ప్రస్తుతం చేస్తోన్న ది ఘోస్ట్ పై చాలా నమ్మకంగా...

రాశి ఫలాలు: ఆదివారం 14 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ బహుళ తదియ రా.2:00 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:05 వరకు తదుపరి...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...