Switch to English

వండర్ బాయ్: 13 ఏళ్లకే ఐఏఎస్ పాఠాలు చెప్తున్నాడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

13 ఏళ్ల వయసు అంటే పదో తరగతి కూడా కాదు. కానీ సోషల్‌ మీడియాలో ఓ కుర్రాడు 13 ఏళ్లకే చక్రం తిప్పేస్తున్నాడు. అది కూడా తన కంటే వయసులో చాలా పెద్ద వాళ్లకు పాఠాలు చెప్పేస్తూ.. బుల్లి మేస్టారుగా అవతారమెత్తేశాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇలాంటి అద్భుతాలు చాలానే విన్నామని అనుకుంటున్నారా..? ఇది నిజం. మన తెలుగు కుర్రాడే ఈ ఘనతను సాధించాడు. పేరు ‘అమర్‌ సాత్విక్‌’. చిన్నప్పటి నుండీ మనోడికి అట్లాస్‌ చూస్తే అదో కిక్‌. ఎక్కడేముందో చిటికెలో పట్టేస్తాడు. గుర్తు పెట్టేసుకుంటాడీ బుడతడు.

బుడ్డోడి ఆశక్తిని గమనించిన తండ్రిగారు తన కొడుకులోని ఈ ప్రత్యేక టాలెంట్‌కి మురిసిపోవడమే కాదు, ఇంకా సాన పెట్టడానికి తనవంతుగా సాయమందించాడు. సాత్విక్‌ తండ్రి ఓ స్కూల్‌ టీచర్‌. ఇకనే తండ్రి బాటలోనే పాఠాలు చెప్పాలని తాను కూడా ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాడు. ఓ సారి సరదాగా జియోగ్రఫీ పాఠమొకటి చెప్పేస్తుంటే, తనయుడి టాలెంట్‌ని చూసి మురిసిపోయిన ఆ పిల్లాడి తల్లి వీడియో తీసింది. దాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది.

‘లెర్న్‌ విత్‌ అమర్‌’ పేరుతో పదేళ్ల వయసులో అమర్‌ యూ ట్యూబ్‌ ఛానెల్‌ని స్టార్ట్‌ చేశాడు. అది 2016. ప్రస్తుతం ఒక లక్షా ఎనభై ఏడు వేల మంది సబ్‌ స్బ్రైబర్లున్నారు లెర్న్‌ విత్‌ అమర్‌ యూట్యూబ్‌ ఛానెల్‌కి. మామూలు పాఠాలు కాదు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ కోచింగ్‌ తీసుకునే వారికి, జియోగ్రఫీలో అత్యంత క్లిష్టమైన పాఠాల్ని అతి సులువుగా అర్ధమయ్యేలా చెప్పడం అమర్‌ ప్రత్యేకత. ఫాలోవర్స్‌ అంతా అమర్‌ కంటే వయసులో చాలా పెద్దవాళ్లు.

అమర్‌ చెప్పే పాఠాలు వింటుంటే, చిన్న పిల్లల చేష్టల్లా ఉండవనీ, ఓ మేధావి చెబుతోన్న అద్భుతమైన విషయాల్లా ఉంటాయనీ సబ్‌ స్క్రైబర్స్‌ చెబుతుంటారు. అంతలా సబ్జెక్ట్‌ మీద పూర్తి గ్రిప్‌ అమర్‌ సొంతం చేసుకున్నాడు. క్లిష్టమైన పేర్లను గుర్తు పెట్టుకోవడం, దేశాలూ, వాటి లొకేషన్స్‌నీ గుర్తించడం.. నదులూ.. ఇతరత్రా ముఖ్యమైన అంశాల్ని ఈజీగా బుర్రలోకి ఎక్కించుకోవడం ఎలా.. అన్నదానిపై అమర్‌ ఇచ్చే ట్రిక్స్‌ చాలా వేల్యూబుల్‌ అనీ, అంటుంటారు ఛానెల్‌ సబ్‌స్క్రైబర్స్‌.

జాగ్రఫీనే కాకుండా ఎకనమిక్స్‌, పొలిటికల్‌ సైన్సెస్‌ వంటి అంశాల్లోనూ పాఠాలు చెప్పే దిశగా అమర్‌ ముందడుగు వేస్తున్నాడు. ఐఏఎస్‌ అధికారి కావాలనుకుంటున్నాడనీ, ఈ క్రమంలో తాను వివిధ అంశాల్లో మరింత ప్రావీణ్యం సాధించాల్సి ఉందని 13 ఏళ్ల అమర్‌ చెప్పాడు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ వైపు ముందడుగు వేస్తే ఎంత లక్ష్యమైనా చిన్నదే అనిపిస్తుందని చెప్పే అమర్‌, తనకూ కొందరి నుండి నెగిటివ్‌ కామెంట్స్‌ వస్తుంటాయనీ, వాటిని పట్టించుకుంటే, ముందడుగు వేయలేననీ అన్నాడు. వీకెండ్స్‌లో మాత్రమే ఈ వర్క్‌ చేసి, మిగతా సమయమంతా, స్కూల్‌ కరిక్యులమ్‌ కోసమే కేటాయిస్తాననీ మన మంచిర్యాల కుర్రోడు అమర్‌ చెప్పాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...