Switch to English

అక్కడ అందరూ కవలలే..ఆ గ్రామం గురించి అందరూ తెలుసుకోవాల్సిందే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఎవరికైనా కవల పిల్లలు పుడితే వారి సంతోషానికి అవధులు ఉండవ్. ఒకే రూపురేఖలు కలిగిన ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో అల్లరి చేస్తుంటే వచ్చే మజాయే వేరు. పైగా కవల పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదైన అంశం కావడంతో ఎక్కడైనా ట్విన్స్ ఉంటే వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఒక ఊళ్లో ఒకరికో, ఇద్దరికో మాత్రమే ఇలా కవలలు పుడుతుంటారు. అదే ఊరు మొత్తం కవలలతో నిండిపోతే, ఏ ఇంటికి వెళ్లినా ట్విన్స్ తారసపడితే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ? దేవుడి సొంత భూమిగా పేరు పొందిన కేరళలోని కోదిన్హి అనే గ్రామం వెళితే మీరు తికమక పడటం ఖాయం.

ట్విట్ టౌన్ గా పేరు పొందిన ఈ గ్రామంలో ఎటు చూసినా కవలలే దర్శనమిస్తారు. ఏ వీధికి వెళ్లినా రాముడూ, భీముడూ హాయ్ అంటారు. ఏ ఇంటికి వెళ్లినా సీత, గీత తారసపడతారు. దాదాపు 2వేల కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామంలో ఏకంగా 400 మంది కవలలు ఉన్నారు. మన దేశంలో ప్రతి వెయ్యి జననాల్లో కేవలం 9 మంది మాత్రమే కవలలు ఉంటుండగా… కోదిన్హి విషయానికొచ్చేసరికి ప్రతి వెయ్యి జననాల్లో 45 మంది కవలలే ఉంటున్నారు. ఇది ప్రపంచంలోని ఏ దేశంలోని సగటు కంటే కూడా చాలా ఎక్కువ. ఏ ఊళ్లోనైనా ఒకరు లేదా ఇద్దరికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఊరు మొత్తం కవలలు పుట్టడం అనేది నిజంగా వింతే.

ఈ నేపథ్యంలో ఇందుక గల కారణాలు తెలుసుకునేందుకు దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దేశీయ పరిశోధకులతోపాటు అంతర్జాతీయ బృందం కూడా ఈ విషయంలో పరిశోధనలు సాగించింది. ఈ గ్రామస్తులు తినే ఆహారం లేదా తాగే నీళ్లలోనే ఏమైనా ఉన్నాయనే అంశం దగ్గర నుంచి జన్యుపరమైన లక్షణాల కారణంగా ఇలా జరుగుతుందేమో అనే కోణం వరకు పలు విషయాల్లో అధ్యయనాలు చేశారు. కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. వియత్నాం, నైజీరియా, బ్రెజిల్ లో కూడా కొన్ని తెగల్లో ఇలా కవలల జననాలు రేటు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిశోధనలు సాగించిన బృందం కోదిన్హి వచ్చి ఇక్కడి కవలల డీఎన్ఏ కూడా సేకరించి అధ్యయనం చేసింది. కానీ కవలల జననాలకు కారణమేంటో తెలుసుకోలేకపోయింది. దీంతో ఇప్పటికీ కోదిన్హి కవలల మిస్టరీ అలాగే ఉండిపోయింది.

ఈ ఊరివాళ్లకే కాదు.. ఈ ఊరికి వచ్చి స్థిరపడినవారికి కూడా కవలలు పుడుతున్నారని, ఈ ప్రాంతంలోనే ఏదో మహత్యం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఊళ్లో కవలలు ఎక్కువగా ఉన్నారనే విషయం చాలా కొత్తగా బయటపడింది. 2006లో 8వ తరగతి చదువుతున్న సమీరా, ఫమీనా అనే కవల అమ్మాయిలు తమ తరగతిలోనే ఎనిమిది మంది కవలలు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఇది వారికి కాస్త ఆశ్యర్యం కలిగించింది. మొత్తం స్కూల్ లో ఎంతమంది ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి వారు ప్రయత్నించగా.. ఏకంగా 24 మంది ట్విన్స్ ఉన్నట్టు తేలింది. ఈ విషయం ఊళ్లో పెద్దలకు తెలిసింది. దీంతో ఊరు మొత్తం ఎంత మంది కవలలు ఉన్నారో తెలుసుకోవడానికి వారు 2008లో ఓ సర్వే చేశారు. ఆశ్చర్యకరంగా 280 మంది కవల జంటలు ఉన్నట్లు తెలియడంతో షాక్ తిన్నారు. తమ గ్రామానికి ఏదో ప్రత్యేకత ఉన్న విషయం అప్పుడు వారికి బోధపడింది. ఈ విషయం పత్రికల్లో రావడంతో కోదిన్హి గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...