Switch to English

సీబీఐ కోర్టులో విచారణకు సీఎం జగన్‌ హాజరవుతారా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

అక్రమాస్తుల కేసుకు సంబంధించి దాదాపుగా ప్రతి శుక్రవారం కోర్టు యెదుట విచారణకు హాజరవుతూ వస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి రేపు న్యాయస్థానం యెదుట హాజరు కాబోతున్నారా? అన్న ప్రశ్న చాలామందిలో ఆసక్తిని రేపుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రేపు ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌, వివిధ శాఖలతో సమీక్షలు జరుపుతూ చాలా బిజీగా వున్నారు.

ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్‌ జగన్‌ తరఫున కోర్టుకి విన్నవించేందుకు ప్రయత్నాలు ప్రారంభయినట్లు తెలుస్తోంది. మరోపక్క, వైఎస్‌ జగన్‌ ప్రస్తుతం ముఖ్యమంత్రి గనుక, వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు పూర్తిస్థాయిలో మినహాయింపు ఇవ్వాలనే దిశగా కూడా జగన్‌ తరఫు లాయర్లు ప్రయత్నాలు చేయనున్నారని సమాచారమ్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం సహా, అన్నీ ఇప్పుడు తనకు అనుకూలంగా కన్పిస్తున్న దరిమిలా, అక్రమాస్తుల కేసు నుంచి కూడా తనకు కొంత మేర ఉపశమనం లభిస్తుందనే ఆశాభావంతో వున్నారట వైఎస్‌ జగన్‌.

అయితే, జగన్‌ ముఖ్యమంత్రి అవడానికీ, అక్రమాస్తుల కేసుకీ సంబంధం లేదనీ, నిందితుడిగా వైఎస్‌ జగన్‌ కోర్టుకు హాజరవ్వాల్సి వుంటుందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. తాత్కాలికంగా వైఎస్‌ జగన్‌కి ఊరట లభించే అవకాశాలున్నా, శాశ్వతంగా ఊరట అనేది అసాధ్యమన్నది వారి అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు నమోదవడం తెలిసిన సంగతులే.

ఈ కేసుల్లో వైఎస్‌ జగన్‌ మొదటి నిందితుడు కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా వున్నారు. తమపై నమోదయినవి రాజకీయ కక్ష సాధింపుకి సంబంధించిన కేసులేనని జగన్‌, విజయసాయిరెడ్డి చాలా కాలంగా వాదిస్తున్నా, కేసుల తీవ్రత దృష్ట్యా విచారణ గట్టిగానే సాగుతోంది. అయితే, లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు కాస్తా అటకెక్కి, వేల కోట్ల అవినీతి ఆరోపణల స్థాయికి కేసు డైల్యూట్‌ అయిపోయిందనే వాదనలు విన్పిస్తున్నాయనుకోండి, అది వేరే సంగతి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...