Switch to English

జస్ట్ ఆస్కింగ్: ‘అమర్ రాజా’ని వాళ్ళెందుకు ఆహ్వానిస్తున్నారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

అమర్ రాజా బ్యాటరీస్.. ఇప్పుడీ పేరు తెలుగు నాట మార్మోగిపోతోంది. నిజానికి, అమర్ రాజా బ్యాటరీస్ పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో సాఫ్ట్ కార్నర్ ఒకటి వుంది. కారణం, ఆ సంస్థకున్న రెప్యుటేషన్. రాజకీయ నేపథ్యం ఈ పరిశ్రమకు వున్నా, ఎప్పుడూ ఈ సంస్థ మీద రాజకీయ పరమైన ఆరోపణలు రాలేదు.

గల్లా కుటుంబం నుంచి ప్రస్తుతం గల్లా జయదేవ్ యాక్టివ్ పాలిటిక్స్‌లో వున్నారు. గతంలోనూ గల్లా కుటుంబం తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినా, అప్పుడెప్పుడూ అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ వివాదాల్లోకెక్కలేదు. చిత్రమేంటంటే, గల్లా కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులైనవారూ, అమర్ రాజా సంస్థను అభినందించేవారు.

కానీ, ఇప్పుడు సీన్ మారింది. కాలుష్యం తీవ్రత ఎక్కవ కావడంతో, అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను తలరించాలని తామే కోరినట్లు ప్రభుత్వంలోని పలువురు కీలక వ్యక్తులు చెబుతున్నారు. ‘వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, మేమే పొమ్మన్నాం..’ అని ప్రభుత్వ పెద్దలు ఓ పక్క చెబుతూనే, ఇంకోపక్క, ‘ప్రభుత్వం పరిశ్రమలపై రాజకీయ పెత్తనం చేస్తోంది..’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

సరే, అమర్ రాజా సంస్థకు సంబంధించి పరిశ్రమల ద్వారా కాలుష్యం విపరీతమైన స్థాయిలో పుట్టుకొస్తోందనే అనుకుందాం. కానీ, దానికి మూసివేత ఒకటే మార్గమా.? కాలుష్యం అంత తీవ్ర స్థాయిలో పరిశ్రమ నుంచి వస్తున్న మాటే నిజమైతే, అలాంటి పరిశ్రమల్ని ఏ రాష్ట్రమూ కోరుకోదు. మరి, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలెందుకు అమర్ రాజా సంస్థకు ఆహ్వానం పలుకుతున్నాయట.? ఈ ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి.

అధికార పార్టీకి చెందిన నేతల తాలూకు క్వారీల్లో నిబంధనల ఉల్లంఘన జరగినా, ఆల్ ఈజ్ వెల్. అదే విపక్ష పార్టీలకు చెందిన నేతల క్వారీల్లో అంతా బాగున్నా.. కేసులు, జరీమానాలు హంగామా. ఇదెక్కడి తీరు.? అక్కడిదాకా ఎందుకు.? ప్రజా వేదికను అమరావతిలో కూల్చేశారు.. మరి, ఆ పక్కనే వున్న అక్రమ భవనాల్ని గడచిన రెండేళ్ళలో ఎందుకు కూల్చలేదు.? ఓ పద్ధతీ పాడూ లేని పాలన కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి దురదృష్టకర పరిణామాలన్న భావన ప్రజల్లో రోజురోజుకీ బలపడుతోందంటే, అందుక్కారణం.. పరిపాలనలో డొల్లతనమే.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...