Switch to English

చంద్రబాబు, జగన్‌, మోడీ.! పోలవరం.. పొలిటికల్‌ ఏటీఎం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. చంద్రబాబు హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. ‘తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు చంద్రబాబు హయాంలో’ అని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అంతే కాదు, వందల కోట్ల అవినీతికి మాత్రం చంద్రబాబు సర్కార్‌ పాల్పడిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేయడం చూశాం. మరోపక్క, ఎన్నికల సమయంలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు అవినీతికి ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అయితే, అవన్నీ పాత విషయాలు.

లేటెస్ట్‌ విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో అస్సలు అవినీతి జరగలేదట. కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా ఈ విషయమై స్పష్టతనిచ్చింది. జనసేన పార్టీ తరఫున గతంలో యాక్టివ్‌గా వ్యవహరించిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, కేంద్రానికి లేఖ రాస్తే.. ఆ లేఖకు సమాధానమిచ్చిన కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి.. అనడానికి అసలు తావే లేదని తేల్చేసింది. మరి, పోలవరం ప్రాజెక్టు.. అప్పటి తెలుగుదేశం సర్కార్‌కి ‘అవినీతి ఏటీఎం’గా మారిందని ప్రధాని ఎందుకు ఆరోపించినట్లు.? పోలవరం ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల కుంభకోణానికి చంద్రబాబు అండ్‌ టీం పాల్పడినట్లు.. వైసీపీ ఎందుకు ఆరోపించినట్లు.? ఇక్కడ తేలాల్సిన లెక్కలు చాలా వున్నాయి.. కేంద్రం తరఫున ‘అవినీతి జరగలేదు’ అని చెప్పినాసరే. ఎందుకంటే, రివర్స్‌ టెండరింగ్‌తో వందల కోట్లు మిగిల్చేశామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. పైగా, అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలుంటాయనీ అంటోంది.

సో, నిజాలు నిగ్గు తేలాల్సిందే. ‘వైసీపీ – టీడీపీ’ మధ్య ’60-40’ బంధం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.? గతంలో టీడీపీ – బీజేపీ మధ్య రాజకీయ పొత్తు నడిచిన దరిమిలా, రెండూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిన దరిమిలా.. ఆ కారణంగానే పోలవరంలో అవినీతి జరగలేదనే సమాధానం కేంద్రం నుంచి వచ్చిందా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్‌. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్రంపైనా వుంది మరి. మొత్తమ్మీద, పోలవరం ప్రాజెక్టుని ప్రధాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అందరూ పొలిటికల్‌ ఏటీఎంలా వాడేసుకున్నారు, వాడేసుకుంటూనే వున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్‌ మాత్రం ఎప్పుడు పూర్తయ్యేనో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...