Switch to English

విశాఖ ఉక్కు చుట్టూ ‘తుక్కు’ రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో అధికారంలో వుంది గనుక, వైసీపీ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై ఏం చేయగలదో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు వైసీపీకి అస్సలేమాత్రం నచ్చలేదు. నచ్చవు కూడా. ఎందుకంటే, వైసీపీ హయాలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కీలకమైన వ్యవహారాలు నడిచాయి. చంద్రబాబు హయాంలో ప్లానింగ్, జగన్ హయాంలో పనులు.. ఇదీ పరిస్థితి.

ఉక్కు పరిశ్రమ నుంచి కేంద్రం తన వాటాల్ని వెనక్కి తీసుకుని, ప్రైవేటుకి ఆ పరిశ్రమను అప్పగించాలనే ప్రయత్నం చేస్తోందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా వుంటుందా.? చంద్రబాబు హయాంలోనూ ‘సీక్రెసీ’ మెయిన్‌టెయిన్ చేశారు.. వైసీపీ హయాంలోనూ అదే జరుగుతోంది. బీజేపీది ఇలాంటి విషయాల్లో చాలా చిత్రమైన వైఖరి. కేంద్ర ప్రభుత్వం వేరు.. బీజేపీ వేరు.. అని చెప్పడం ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అమరావతి విషయంలోనూ ఇదే వైఖరి, విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే వైఖరి.

సరే, కాస్సేపు కేంద్రం సంగతి పక్కన పెడదాం.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఏమయ్యింది.? వైసీపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా గల్లీలో కాకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నాయి.? రాష్ట్రం తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలతో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చర్చలు జరిపారు.

పవన్ కళ్యాణ్ చెప్పగానే, ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేందుకు కేంద్రం సిద్ధమవుతుందా.? అన్నది వేరే చర్చ. కానీ, ప్రయత్నమంటూ జరగాలి కదా.? దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పేశానని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పటిదాకా ఈ విషయమై జాతీయ స్థాయిలో ఎందుకు కార్యాచరణ చేపట్టలేదు.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ఢిల్లీకి వెళ్ళడంలేదు.? ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుకీ, అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు అవసరం.. రాష్ట్ర ప్రయోజనాలు అనవసరం.

గల్లీలో చెయ్యాల్సిన పోరాటం కాదిది. ఢిల్లీలో పోరాటం చేయాలి. అది మానేసి.. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే ఉపయోగమేంటి.? టీడీపీ – వైసీపీ పరస్పర విమర్శలతో కేంద్రానికి అదనపు రాజకీయ లబ్ది తప్ప, విశాఖ ఉక్క ఉద్యమానికి ఈ రాజకీయం ఏమాత్రం ఉపయోగపడదు. విశాఖ జిల్లాలో ఓడిన పవన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచిన వైసీపీ, టీడీపీ.. రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టి, పరస్పర రాజకీయ విమర్శలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...