Switch to English

ఉప్పెన మూవీ రివ్యూ – అంచనాలను అందుకోని ఉప్పెన.

Critic Rating
( 2.25 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow
Movie ఉప్పెన
Star Cast పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి
Director బుచ్చిబాబు సన
Producer నవీన్ యెర్నేని - రవి శంకర్
Music దేవీశ్రీ ప్రసాద్
Run Time 2 గంటల 28 నిమిషాలు
Release ఫిబ్రవరి 12, 2021

విడుదలకి ముందే అటు బిజినెస్ పరంగా, ఇటు సూపర్ హిట్ అయిపోయింది అనే రేంజ్ లో టాక్ తెచ్చుకొని సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘ఉప్పెన‘. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఉప్పెన సినిమా ఎన్నో ఓటిటి ఆఫర్స్ ని రిజెక్ట్ చేసుకొని నేడు థియేటర్స్ లో రిలీజయింది. మరి ఆ సినిమా అంచనాలకి తగ్గట్టే బ్లాక్ బస్టర్ లా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

చాలా సినిమాల్లానే ఓపెనింగ్ సీన్ లో హీరో ఆశీర్వాదం అలియాస్ ఆశీ(పంజా వైష్ణవ్ తేజ్)ని దెబ్బలతో బీచ్ లో పడిపోయి ఉంటాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కథ మొదలు పెడితే.. ఆశీర్వాదం సముద్ర తీరమైన ఉప్పాడ గ్రామంలోని ఓ జాలరి, తక్కువ కులానికి చెందిన వాడు. తనకి చిన్నప్పటి నుంచీ బేబమ్మ(కృతి శెట్టి) అంటే ప్రేమ. చిన్నప్పటి నుంచీ ఆశీర్వాదం తనని ఫాలో అవుతూనే ఉంటాడు. బేబమ్మ తన కాలేజ్ డేస్ లో ఆశీర్వాదంని చూడడం, ప్రేమలో పడడం జరిగిపోతాయి. ఇక అక్కడి నుంచీ ఎవ్వరికీ తెలియకుండా కలుసుకుంటూ, ప్రేమించుకుంటూ ఉంటారు. ఒక రోజు రాత్రి వీరిద్దరూ కనపడకుండా సముద్రంలోకి వెళ్లిపోవడంతో వీరిద్దరి విషయం బేబమ్మ ఫాదర్ రాయనం(విజయ్ సేతుపతి)కి తెలుస్తుంది. కులం మరియు పరువు కోసం ఏమన్నా చేసే రాయనం పాత్ర ఆశీర్వాదం – బేబమ్మల ప్రేమని ఎలా అడ్డుకున్నాడు? వారిని విడగొట్టడానికి ఏం చేసాడు? ఆశీర్వాదం – బేబమ్మలు వారి ప్రేమని బ్రతికించుకోవడం కోసం ఏమేమి చేశారు? రాయనం తన పరువు కోసం ఆశీర్వాదంని చంపేశాడా? లేక ఇంకేమైనా చేశాడా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ఈ సినిమాకి ప్రధాన బలం నటీనటుల ఎంపికే.. పంజా వైష్ణవ్ తేజ్ కి – కృతి శెట్టి లకి మొదటి సినిమానే కానీ చాలా మెచ్యూర్ యాక్టింగ్ చేయడమే కాకుండా ప్రతి సందర్భానికి అద్భుతమైన హావభావాలని పలికించిన కారణంగా తో ఆడియన్స్ మదిలో నిలిచిపోతారు. వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ లో ఆ యాసని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేయడమే కాకుండా, లవ్ సీన్స్ లో చాలా బాగా చేసాడు. అందరూ అన్నట్టు వైష్ణవ్ వి మంచి అట్రాక్టింగ్ కళ్ళు, అందుకే కళ్ళతో చాలా భావాలను పర్ఫెక్ట్ గా పలికించాడు. ఇకపోతే కృతి శెట్టి.. అందం + అభినయం కలిగిన హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటారు, అందులో కృతి ఒకటని చెప్పచ్చు. స్క్రీన్ మీద తన అందానికి, తన హావా భావాలకి పడిపోని కుర్రాడు ఉండడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా చేసింది. ఇక సినిమాకి మేజర్ హైలైట్ అయిన విజయ్ సేతుపతి గురించి మాట్లాడాలి. రాయనం పాత్రలో తను కళ్ళతోనే పలికించిన ఎక్స్ ప్రెషన్స్, యాటిట్యూడ్ సింప్లీ సూపర్బ్. కానీ కాస్త కష్టమైనా విజయ్ సేతుపతి ఒరిజినల్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే పక్కాగా కలుగుతుంది.

ఇక సినిమాలో వైష్ణవ్ ఫ్రెండ్ తాలింపు పాత్ర చేసిన కుర్రాడు నవ్విస్తాడు. రాజీవ్ కనకాల, సాయి చంద్ హీరో ఫతేహ్ర్ పాత్రలో ఎమోషనల్ సీన్స్ కి పెద్ద హెల్ప్ అయ్యారు.

తెర వెనుక టాలెంట్..

ఆఫ్ స్క్రీన్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి బిగ్గెస్ట్ హైలైట్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని ఇప్పటికే సాంగ్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ తోనే చెప్పచ్చు. అందరూ పాటలే ఇలా ఉంటే విజువల్స్ ఇంకా బాగుంటాయి అనుకున్నారు, బాగున్నాయి కూడా కానీ పాటలకి మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. స్పెషల్ గా విజయ్ సేతుపతికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే పక్కా టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. ఇకపోతే శ్యామ్ దత్ విజువల్స్ బుచ్చి బాబు రాసుకున్న కథకి ప్రాణం పోశాయని చెప్పాలి. నటీనటుల్ని చూపించడంలో, విజువల్ టెల్లింగ్ లో మాస్టర్ అనిపించుకున్నాడు. నవీన్ నూలి విజువల్ కట్ బాగుంది, ఓవరాల్ గా సినిమా చూసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా లాగ్ అనిపిస్తే, సెకండాఫ్ ని చాలా ఎక్కువగానే సాగాదీసేసారు బాబోయ్ అనే ఫీలింగ్ వస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ ఉన్నాయి.

మెగాస్టార్ చిరునే స్క్రీన్ ప్లే అనేది ఈ సినిమా చూసి నేర్చుకోవాలి, సుకుమార్ ఏమో ఇది 100 కోట్ల సినిమా అనడం ఉప్పెన సినిమాపై హైప్ పెంచేశారు. మరి ఆ అంచనాలకు ఏ మాత్రం కెప్టెన్ అఫ్ ది షిప్ బుచ్చిబాబు సన డీల్ చేసాడో చూద్దాం. మొదటగా కథ విషయానికి వస్తే.. మన తెలుగు ప్రేక్షకులు చాలా రోజులుగా చూస్తున్న పేద – ధనిక మధ్య జరిగే నార్మల్ ప్రేమ కథే ఉప్పెన. కానీ బుచ్చిబాబు కథలో కొత్తగా చెప్పిన వాటిల్లో మొదటిది క్లైమాక్స్, అది వర్కౌట్ అయ్యిందా లేదా అనేది తర్వాత మాట్లాడదాం. రెండవది బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది ఫిలిం. తన గురువు సుకుమార్ లానే రెగ్యులర్ పాయింట్ ని కొత్త బ్యాక్ డ్రాప్ అయిన సమద్రం, ఫిషర్ మాన్ సెటప్ లో చెప్పడం సినిమాలో ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇకపోతే వాళ్ళు అనుకున్న క్లైమాక్స్ పాయింట్ సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. అది ముందే లీక్ అయిపోవడం, తెలుగు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. స్క్రీన్ ప్లే అనేది మరో మైనస్. అన్ని ప్రేమ కథల్లానే ఈ సినిమా కథనం కూడా మొదటి నుంచీ మనం అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు కీ పాయింట్ అనుకున్నది అంత బాలేకపోవడం సెకండాఫ్ ని ముంచేసింది చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తెలిసినా ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ లో పాత్రలు, పెర్ఫార్మన్స్ ల వలన అలా హ్యాపీగా నడిచిపోద్ది కానీ సెకండాఫ్ చూస్తున్నప్పుడు సడన్ గా ఇంకేదో కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా వీక్ గా ఉంది. ఇక డైరెక్టర్ గా బుచ్చిబాబు సన కొంత సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు మిగతా సగం అనుకున్నది ప్లాప్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– పంజా వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టిల సూపర్బ్ పెర్ఫార్మన్స్
–  విజయ్ సేతుపతి పవర్ఫుల్ రోల్
– హాయిగా సాగిపోయే ఫస్ట్ హాఫ్
– శ్యామ్ దత్ సూపర్బ్ విజువల్స్
– దేవీశ్రీ ప్రసాద్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– సెకండాఫ్ పూర్తిగా డ్రాప్ అవ్వడం
– కథలో కీలకం అయిన పాయింట్ వర్కౌట్ కాకపోవడం
– రక్తి కట్టించలేకపోయిన కథనం
– మరీ సాగదీసేసారు అనే ఫీలింగ్
– ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
– వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

ఉప్పెన సినిమా ఎలా ఉంది అనేది సెకండరీ పాయింట్. ఎందుకంటే చిరు దగ్గర నుంచీ ప్రతి ఒక్కరూ ‘ఉప్పెన’ పై భారీ అంచనాలను పెంచేశారు. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అన్ని అంచనాలతో సినిమా చూస్తున్నప్పుడు కొద్దిగా బాలేకపోయినా ఎక్కువ డిజప్పాయింట్ అవుతారు, అలాంటిది సెకండ్ హాఫ్ ఏ బాలేదంటే ఇక ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటదో చెప్పక్కర్లేదు. ఓవరాల్ గా ఉప్పెన ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ లో కొత్త బ్యాక్ డ్రాప్, విలన్ పాత్ర, లవ్ స్టోరీ, సూపర్బ్ అనిపించే పాటలు, బ్యూటిఫుల్ విజువల్స్, యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ తో హాయిగా ఓ పడవ ప్రయాణంలా ఉంటుంది. కానీ సెకండాఫ్ లో వేగం, ఆసక్తి తగ్గిపోవడం, కథ ఏటేటా వెళ్లడంతో చూసే ఆడియన్స్ లో నీరసం వచ్చేస్తుంది. హాయిగా సాగిపోతున్న పడవ ప్రయాణం తుఫాన్ కి ఎటెటో కొట్టుకెళ్ళిపోద్ది, అంతా గందరగోళం అయిపోయి నిరాశతో బయటికి పంపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ అయిన గ్రేట్ ఫీలింగ్ ని సెకండాఫ్ పూర్తిగా డిజప్పాయింట్ చేసే సినిమా ‘ఉప్పెన’.

చూడాలా? వద్దా?: మరీ రియలిస్టిక్ ప్రేమకథలు కోరుకునే వారికి కొంతవరకూ ఓకే, కానీ మిగతా వారికి కష్టం.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.25/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

ఎక్కువ చదివినవి

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...