Switch to English

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: అడ్డు పుల్ల ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

‘చంద్రబాబు కాళ్ళు పైకి, తలకాయ కిందకీ పెట్టినా.. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆపలేరు..’ అంటున్నారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంచిదే, ఎవరు కాదన్నారు.? ఎవరు అడ్డుకుంటున్నారు.? ఇదే అసలు సమస్య.!

మూడు రాజధానుల దిశగా వైసీపీ సర్కారు గతంలోనే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టింది, నానా తంటాలూ పడి, దాన్ని చట్టంగా చేసింది. కోర్టు చీవాట్లతో చట్టాన్ని వెనక్కి తీసుకుంది కూడా. సో, మూడు రాజధానుల అంశం ఇప్పుడెక్కడుంది.? ప్రస్తుతానికి వున్నదల్లా ఒకటే రాజధాని.. అదే అమరావతి.

నిజానికి, మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని పురిట్లోనే వైసీపీ సర్కారు చంపేసినట్లయ్యింది. ‘సమగ్రమైన బిల్లు తీసుకొస్తాం..’ అని అసెంబ్లీలో చెప్పేసి ఊరుకుంది వైసీపీ సర్కారు. అంతే, ఆ సమగ్రమైన బిల్లుకి ఎప్పుుడు మోక్షం కలుగుతుందో ఎవరికీ అర్థం కాని డైలమా షురూ అయ్యింది.

ఒక రాజధాని అమరావతి, కాస్తో కూస్తో అభివృద్ధి చెందితే, ఆ తర్వాత మరో రెండు.. కాదు, ఇరవై.. లేదూ, ఓ యాభై రాజధానులు కట్టుకున్నా ఎవరూ వద్దనరు. అసలంటూ ఒక్క రాజధాని అమరావతిని స్మశానంగా, ఎడారిగా అభివర్ణిస్తూ, మూడు రాజధానులనడమేంటి.? అందులో అమరావతి కూడా ఒకటని చెప్పడమేంటి.?

వైసీపీ సర్కారుకి, అసలు రాజధాని అనే అంశం పట్ల కాస్త కూడా చిత్తశుద్ధి లేదు, కనీసపాటి అవగాహన వున్నట్లు కూడా కనిపించడంలేదు. అందుకనే, అమరావతి అతీ గతీ లేకుండా పోయింది గడచిన మూడేళ్ళుగా. ఓ రాష్ట్ర ప్రభుత్వం, రాజధానిని పట్టించుకోకుండా వదిలేయడమనేది చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదేమో.!

సరే, అమరావతి పేరుతో గతంలో చంద్రబాబు కుంభకోణమే చేశారనుకుందాం. ఆ కుంభకోణం బయటపెట్టాలి కదా.? దోచేసిన సొమ్ముని ముక్కుపిండి మరీ వసూలు చెయ్యాలి కదా.? అది చెయ్యకుండా అమరావతిని ఆపెయ్యడమేంటి.? పైగా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు చెప్పి ఉత్తరాంధ్రుల్నీ, న్యాయ రాజధాని పేరు చెప్పి రాయలసీమ వాసుల్నీ రెచ్చగొట్టి వైసీపీ ఏం సాధించింది.? ఏం సాధిస్తుంది.?

చంద్రబాబు సంగతేమోగానీ, వైసీపీ తల్లకిందులుగా తపస్సు చేసినా, మూడు రాజధానులు జరిగే పని కాదని తేలిపోయింది కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...