Switch to English

విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ రివ్యూ 

Critic Rating
( 2.75 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ..
నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని
దర్శకత్వం: శైలేష్ కొలను
సినిమాటోగ్రఫీ: మణి కందన్
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్‌: గ్యారీ బిహెచ్
రన్ టైం: 2 గంటల 06 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2020

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ‘అ!’ విమర్శకుల ప్రశంశలు అందుకుంది. మరోసారి నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమా దాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. నూతన దర్శకుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిమించారు. ఒకసారి థియేటర్ లోకి వస్తే మధ్యలో వెళ్లలేరని విశ్వక్ సేన్ ప్రమోషన్స్ లో చెప్పాడు. మరి ఆ స్టేట్మెంట్ నిజం చేసేలా ఈ హిట్ మూవీ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ఒక సక్సెసఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. కానీ కొద్దీ రోజులుగా తన గతం వలన మెంటల్ స్ట్రోక్స్ కి లోనవుతూ ఉంటాడు. అదే టైంలో ప్రీతీ మిస్సింగ్ కేసు వస్తుంది. ఆ కేసు డీల్ చేసే ఆఫీసర్ సరిగా లేకపోవడం, అలాగే తనతోటి ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ నేహా(రుహాని శర్మ) కూడా మిస్ అవ్వడం వలన అందరికీ విక్రమ్ మీద అనుమానాలు మొదలవుతాయి. దాంతో విక్రమ్ స్వయంగా ప్రీతీ, నేహాల కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి ఆ కేసు సాల్వ్ చేయడంలో విక్రమ్ ఎదుర్కున్న సవాళ్లేంటి.? విక్రమ్ ఎలా ఆ కేసుని సాల్వ్ చేసాడు? ప్రీతి – నేహా ల మిస్సింగ్ వెనుక ఉన్న కథేంటి? అసలు విక్రమ్ ని ఎందుకు సస్పెక్ట్ చేశారు అనే ప్రశ్నల సమాధానమే ఈ హిట్ సినిమా..

తెర మీద స్టార్స్..   

ఒక్క విక్రమ్ రుద్రరాజు అలియాస్ విశ్వక్ సేన్ తప్ప మిగతా అందరూ తెర మీద మనకు కనిపించే టైం తక్కువే.. విశ్వక్ సేన్ మైండ్ బ్లోయింగ్ నటనతో ప్రేక్షకులతో ఏం చేసిండు మామా.. మస్త్ చేసాడు అని అనుకోకుండా ఉండరు. మెంటల్లీ డిస్టర్బ్ అయిన షేడ్స్ చూపిస్తూనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా తను చేసిన పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. విశ్వక్ సేన్ లోని టాలెంట్ ని మరో కోణంలో ప్రూవ్ చేసుకునే సినిమా హిట్ అని చెప్పచ్చు. ‘చిలసౌ’ ఫేమ్ రుహాని శర్మ ఉన్నంతలో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. విశ్వక్ సేన్ – రుహాని శర్మల లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఈ సీరియస్ థ్రిల్లర్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ ద్వారా ఆడియన్స్ కి కొన్ని నవ్వులు పంచారు. భాను చందర్, మురళి శర్మ, హరితేజ తదితర నటీనటులు వారి వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

తెర వెనుక టాలెంట్..   

బడ్జెట్ పరంగా చిన్న సినిమానే కావచ్చు కానీ టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా తెర వెనుక టీం వెరీ హై బడ్జెట్ ఫిల్మ్ రేంజ్ కి తీసుకెళ్లారు. మణి కందన్ విజువల్స్ ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ఉంది. ఇలాంటి విజువల్స్ మన సినిమాల్లో చాలా రేర్ గా చూస్తుంటాం కానీ ఈ జానర్ ఫిల్మ్ కి పర్ఫెక్ట్ విజువల్స్ ఇచ్చాడు. ఆ విజువల్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది మాత్రం వివేక్ సాగర్ మ్యూజిక్. క్రైమ్ థ్రిల్లర్ అంటే ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఫీల్ ని కలుగ చేయాలి. ఆ విషయంలో వివేక్ సాగర్ 200% సక్సెస్ అయ్యాడు. అలాగే గ్యారీ ఎడిటింగ్ కూడా టాప్ లెవల్ అని చెప్పాలి. ఎడిట్ కట్ ఈ సినిమాని ఆడియన్స్ కి మరింత ఎంగేజ్ అయ్యేలా చేసింది.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ శైలేష్ కొలను విషయానికి వస్తే.. పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ తీయాలంటే కథ కంటే కట్టిపడేసే స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఆ విషయంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే డైరెక్టర్ గా కూడా అన్ని డిపార్ట్ మెంట్స్ నుంచి బెస్ట్ తీసుకోవడంలో, ఆర్టిస్టుల నుండి బెటర్ పెర్ఫార్మన్స్ తీసుకోవడంలో, ఆడియన్స్ కి కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా తీసాడు అనే పేరు తెచ్చుకునే స్థాయిలో డైరెక్ట్ చేసాడు. ఇక కథ పరంగా సింపుల్ పాయింట్, కథలో థ్రిల్స్ ని బాగానే పెట్టుకున్నాడు కానీ ఎమోషనల్ కనెక్ట్ విషయంలో కొంత ఫెయిల్ అయ్యాడు. క్రైమ్ చుట్టూ అల్లుకున్న అంశాలన్నీ సూపర్ కానీ క్రైమ్ చేయడానికి గల కారణాలే అంత బలంగా లేకపోవడం వలన క్లైమాక్స్ లో ఆడియన్స్ కొంత నిరాశ చెందుతారు. అలాగే హీరో పాత్రలో పానిక్ అటాక్స్ రావడానికి ఏదో కారణం ఉంది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి చివరికి అదొక డీవియేషన్ లాగానే వాడుకొని వదిలేయడం కూడా చూసే ప్రేక్షకులకి కొంత నిరాశని కలిగిస్తుంది. నాని అండ్ ప్రశాంతి త్రిపురనేని ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్.

విజిల్ మోమెంట్స్:  

– స్పీడ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
– ఫస్ట్ హాఫ్
– విశ్వక్ సేన్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్
– సూపర్బ్ టెక్నికల్ స్టాండర్డ్స్ (సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్)
– ఇంటర్వల్  అండ్ ప్రీ క్లైమాక్స్
– ఊహించలేని ట్విట్స్

బోరింగ్ మోమెంట్స్:  

– సెకండాఫ్ మధ్యలో డ్రాగ్ చేయడం
– బెటర్ గా ఉండాల్సిన క్రైమ్ పాయింట్
– ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం

విశ్లేషణ: 

నూతన దర్శకుడు శైలేష్ కొలను విశ్వక్ సేన్ ని ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ చేసిన ‘హిట్’ సినిమాలో, హిట్ అనిపించుకునే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. అలాగే ప్రేక్షకులని నిరాశ పరిచే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. విశ్వక్ సేన్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్, గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే క్రైమ్ రివీలింగ్ పాయింట్స్ మీ చేత వావ్ అనిపించుకుంటే, సెకండాఫ్ లో ఒక స్టేజ్ తర్వాత డ్రాగ్ అనిపించే ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్రైమ్ రీజన్ బెటర్ గా లేకపోవడంతో పరవాలేదు బాగానే ఉంది అనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వస్తారు. ఓవరాల్ గా ‘హిట్’ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేయదు, అలా అని ఫెంటాస్టిక్ అని కూడా అనిపించుకోదు. ఓకే బాగుంది అనే ఫీలింగ్ అయితే పక్కాగా ఇస్తుంది.

ఇంటర్వల్ మోమెంట్: వావ్.. బ్రేక్ ఎందుకబ్బా సెకండాఫ్ వేసేయండి.!

ఎండ్ మోమెంట్: అంతా బాగా తీసుకొచ్చి క్లైమాక్స్ వీక్ చేసేశాడబ్బా.. జస్ట్ ఓకే క్రైమ్ థ్రిల్లర్.!

చూడాలా? వద్దా?: క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు పక్కాగా చూడచ్చు.

బాక్స్ ఆఫీస్ రేంజ్:

పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ కి ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ పెరుగుతోంది. గతంలో వచ్చిన ‘క్షణం’, ‘ఎవరు’ తరహాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లో శైలేష్ సక్సెస్ అవ్వడం వలన ఒక డీసెంట్ సినిమా చూసాం అనే ఫలియింగ్ ని ఇస్తుంది. ఏ సెంటర్, మల్టీ ప్లేస్ ఆడియన్స్ కి నచ్చే సినిమా ‘హిట్’. మాస్ సెంటర్స్ లో కొంతవరకూ డౌట్ అని చెప్పచ్చు. బి, సి సెంటర్స్ లో క్రౌడ్ రాబట్టుకోవడానికివిశ్వక్ సేన్ గత సినిమా ఎఫెక్ట్, నాని ట్యాగ్ మాత్రమే హెల్ప్ కానుంది. ‘అ!’ తర్వాత అదే తరహాలో బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీతో నాని చేసిన ఈ హిట్ ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కొన్ని పైసలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ అనిపించుకుని ఓటిటి ప్లేట్ ఫామ్ లో మాత్రం పక్కాగా హిట్ అనిపించుకుంటుంది.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2.75/5

Click Here for Live Updates

<<<< —- విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ లైవ్ అప్డేట్స్  —->>>>

07:00 AM: హిట్ మూవీ ఫైనల్ రిపోర్ట్: సూపర్బ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండాఫ్ తో ఆధ్యంతం ఉత్కంఠగా సాగే సినిమా ‘హిట్’. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కొన్ని కొన్ని మోమెంట్స్ మనకి లాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా మంచి ఫీల్ తోనే బయటకి వస్తాం.

06:50 AM: సెకండ్ హాఫ్ రిపోర్ట్:

ఫస్ట్ హాఫ్ టెంపోలోనే సెకండాఫ్ మొదలైనప్పటికీ కొన్ని కొన్ని ఇన్వెస్టిగేటింగ్ సీన్స్ వలన మధ్యలోకాసేపు సాగదీసినట్టు అనిపించినా ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ స్పీడప్ అయ్యి మంచి ఫీల్ తో మూవీ ఎండ్ అయ్యింది.

06:45 AM: అన్ని క్లూస్ ని కలిపి కథని ముగించారు అండ్ సెకండ్ పార్ట్ కి లీడ్ తో సినిమాని ముగించారు..

06:40 AM: ప్రీతీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ మిస్సింగ్ కి నేహా మిస్సింగ్ కి సంబంధం ఏమిటి? అనే థ్రిల్స్ రివీలింగ్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ జరుగుతోంది.

06:35 AM: సెకండాఫ్ మధ్యలో కాసేపు స్లో అయినప్పటికీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి సినిమా స్పీడ్ అందుకుంది..

06:30 AM: ఫైనల్లీ విక్రమ్ అన్ని క్లూస్ ని కలిపి ఈ కిడ్నాప్స్ వెనకున్న అసలు సైకోని పట్టుకున్నాడు..

06:15 AM: సెకండాఫ్ లో 20 నిమిషాల తర్వాత థ్రిల్స్ తగ్గి ఎక్కువ ఇన్వెస్టిగేషన్ మోడ్ సీన్స్ వలన సాగదీస్తున్నట్టున్నారు అనే ఫీలింగ్ ని కలిగిస్తోంది.

06:05 AM:  సెకండాఫ్ లో కూడా ఆ థ్రిల్లింగ్ మోమెంట్స్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు.. క్లూ తో కేసు సాల్వింగ్ అవుతుంది అనుకున్నారు కానీ ట్విస్ట్ లతో కథని నడిపిస్తున్నారు.

05:55 AM: ఫైనల్ గా విక్రమ్ కి ఫస్ట్ క్లూ దొరికింది.. దాన్ని బేస్ చేసుకొని ప్రీతీ కేసుని సాల్వ్ చేసేసే స్టేజ్ కి కథ వెళ్తోంది..

05:45 AM: ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: క్రైమ్ స్ట్రోక్ బ్యాక్ డ్రాప్ లో మొదలైన హిట్ మూవీ మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకూ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. హీరో విక్రమ్ కేసుని సాల్వ్ చేసే టెక్నిక్స్ అందరినీ థ్రిల్ చేస్తాయి. స్పెషల్ గా ఇంటర్వెల్ ఛేజ్ సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్ ని ఒక హై మోమెంట్ కి తీసుకెళ్ళి నెక్స్ట్ ఏంటా అనే సస్పెన్స్ ఫీలింగ్ ని మీకు కలిగిస్తుంది.

హైలైట్స్:

– సూపర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
– విశ్వక్ సేన్ పెర్ఫార్మన్స్
– ఇంటర్వల్ ఛేజ్ సీక్వెన్స్.

05:40 AM: ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఛేజ్ సీక్వెన్స్ సింప్లీ సూపర్బ్.. టేకింగ్, విజువల్స్ మరియు నేపధ్య సంగీతం మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

05:35 AM: విక్రమ్ కేసు సాల్వ్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు కానీ అదే టైంలో తనకి పానిక్ అటాక్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.. కానీ దానికి అసలైన కారణం ఇంకా రివీల్ చేయాల్సి ఉంది..

05:30 AM:  సినిమా మొదలై 50 నిమిషాలు, సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆధ్యంతం ఆసక్తి రేకెత్తించే స్క్రీన్ ప్లే తో సినిమా దూసుకెళ్తోంది.. పలు సబ్ ప్లాట్స్ తో ప్రీతీ ఫస్ట్ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు..

05:20 AM: సంథింగ్ మిస్టరీగా ఉన్న ఈ కేసుని విక్రమ్ తన సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టడంతో కేసు మరియు సినిమా మరింత ఇంటరెస్టింగ్ గా సాగుతోంది..

05:15 AM: ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే నేహా(రుహాని శర్మ) కూడా మిస్సింగ్.. ప్రస్తుతం ఆ కేసు డీల్ చేస్తున్న అభిలాష్ ఏమో విక్రమ్ ని అనుమానిస్తుంటాడు..

05:10 AM: హిట్ సినిమా అసలైన ఫస్ట్ కేసు లో లాండ్ అయ్యింది.. ఇక కథ మొత్తం నడిచే ప్రీతీ మిస్సింగ్ కేసు సాల్వ్ చేయడం మొదలైంది. ఆ కేసుని డీల్ చేస్తున్న సిఐ మనోజ్ శర్మ చేరిన తప్పు వలన ఆ కేసు నుంచి సస్పెండ్ అయ్యాడు..

05:00 AM: ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన విక్రమ్ ఓ మిస్టరీ మర్డర్ కేసుని సాల్వ్ చేస్తున్నాడు. సినిమా ఇప్పటి వరకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది..

04:55 AM: స్నీక్ పీక్ గా రిలీజ్ చేసిన 4 నిమిషాల వీడియోతోనే సినిమా మొదలవుతుంది.. చాలా ఆసక్తిని రేకెత్తించిన ఈ సీన్ ఎండింగ్ కూడా థియేటర్స్ లో అందరినీ థ్రిల్ చేస్తుంది.

04:50 AM:విక్రమ్ ఓకే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కానీ తన ఫామిలీని లాస్ అవ్వడం వలన తను ఇలా స్ట్రెస్ అటాక్స్ కి లోనవుతుంటాడు. కానీ అది డిపార్ట్ మెంట్ కి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు..

04:45 AM: విక్రమ్ అలియాస్ విశ్వక్ సేన్ ఇంట్రడక్షన్ తో సినిమా మొదలైంది. గత జ్ఞాపకాల వలన విక్రమ్ పలు మెంటల్ పానిక్ అటాక్స్ కి లోనయ్యే సీన్స్ జరుగుతున్నాయి.

04:40 AM: విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ – ‘ది ఫస్ట్ కేసు’ సినేమానా ‘యు/ఏ’ సర్టిఫికేట్ తో 126 నిమిషాల రన్ టైంతో మొదలైంది..

మా తెలుగుబుల్లెటిన్.కామ్ టీం ఎప్పటిలానే వరల్డ్ ఫస్ట్ యస్ ప్రీమియర్ షో నుంచి లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ మీకందిస్తోంది.. ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 4గంటల 30నిమిషాలకి లైవ్ అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి.. సో మిస్ కావద్దు..

విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ ప్రివ్యూ:

‘అ!’ సినిమా తర్వాత నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమా దాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ నేడు అనగా ఫిబ్ర‌వ‌రి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...