Switch to English

Virupaksha Review: విరూపాక్ష మూవీ రివ్యూ: ఆకట్టుకునేలా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

Critic Rating
( 2.75 )
User Rating
( 2.80 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow
Movie విరూపాక్ష
Star Cast సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్
Director కార్తీక్ వర్మ దండు
Producer BVSN ప్రసాద్
Music అజనీష్ లోక్‌నాథ్
Run Time 2గం 25ని
Release 23 ఏప్రిల్ 2023

Virupaksha Review: సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్ లో కనిపించిన విరూపాక్ష ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో ఆకర్షించింది. మిస్టీరియస్ థ్రిల్లర్ గా అనిపించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

చేతబడి చేస్తున్నారన్న ఆరోపణల మీద రుద్రవణం అనే ఊర్లో ఒక జంటను ఊరి జనమంతా కలిసి చంపేస్తారు. వారి వల్లే చిన్న పిల్లలు చనిపోయారని భావిస్తారు ఊరి జనం. అయితే చనిపోయే ముందు ఆ మహిళ, ఈ ఊరి మొత్తం పుష్కర కాలంలో వల్లకాడు అవుతుందని శాపం పెడుతుంది.

ఇది జరిగిన సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత ఈ శాపం ఎఫెక్ట్ చూపించి ఊర్లో అందరూ ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెడతారు. ఇక జాతర చూడటానికి అని వచ్చిన సూర్య ఈ కష్టం నుండి ఊరిని గట్టెక్కించాడా?

నటీనటులు:

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇది కచ్చితంగా కొత్త జోనర్ ఫిల్మ్. ఇప్పటివరకూ ఇలాంటి సినిమాను అటెంప్ట్ చేయలేదు తేజ్. సో తేజ్ ను ఈ జోనర్ లో చూడటం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇక పెర్ఫార్మన్స్ గురించి పెద్దగా చెప్పడానికంటూ ఏం లేదు. నీట్ గా తన పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే తేజ్ తన ఫిజిక్ మీద దృష్టి పెట్టాలేమో అనిపించింది.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. మంచి పాత్ర దక్కింది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ వస్తాయి. సునీల్, రాజీవ్ కనకాల, అజయ్, బ్రహ్మాజీ, సాయి చంద్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

తన మొదటి చిత్రమే అయినా కూడా కార్తీక్ దండు ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ను తీసుకున్నాడు. సాంకేతికంగా మంచి ప్రోడక్ట్ ను బయటకు తీసుకువచ్చాడు. తన క్రూ నుండి మంచి ప్రొడక్ట్ ను రాబట్టుకోవడంలో కొత్త దర్శకుడు అయినా సక్సెస్ సాధించాడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి కచ్చితంగా ప్లస్ అయింది. చిత్రమంతా టెంపో మైంటైన్ అయ్యేలా జాగ్రత్త తీసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ కూడా ఆకట్టుకుంటాయి.

సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్లుగా సాగింది. మిస్టరీ థ్రిల్లర్ కు సరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది.

ప్లస్ పాయింట్స్:

  • స్టోరీ, స్క్రీన్ ప్లే
  • సెకండ్ హాఫ్ లో ట్విస్ట్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • యూనివర్సల్ అప్పీల్ లేకపోవడం
  • రిపీట్ వేల్యూ లేకపోవడం
  • ఫస్ట్ హాఫ్ లోని లవ్ ట్రాక్

విశ్లేషణ:

విరూపాక్ష చాలా అంశాల్లో మెప్పించే ఒక ఎంగేజింగ్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కోసం బేస్ గా ఉపయోగపడింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ఆసక్తిని నిలపడంలో టీమ్ సక్సెస్ అయింది. సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు కచ్చితంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడగలరు. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఈ చిత్ర ప్లస్ పాయింట్స్ లో ఒకటి అనడంలో సందేహం లేదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...