సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే హీరోనా.? నిజ జీవితంలో విలనా.? ఈ చర్చ తెరపైకొచ్చిందంటే, ఆషామాషీగా కాదు. ఓ తమిళ నటి, తాజాగా నందమూరి బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె నేరుగా బాలకృష్ణ పేరు ప్రస్తావించలేదుగానీ, ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు, ఆ సినిమా హీరో తనను వేధించినట్లుగా పేర్కొంది.
ఆ సినిమా పేరు ‘భలేవాడివి బాసూ’. ఆ సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ. తన పేరు కూడా తెలుసుకోకుండానే తనను, ఆ హీరో తన రూమ్‌లోకి ఒంటరిగా రమ్మన్నాడట. ‘నేను రాను’ అని ఆమె చెప్పేసరికి, ఆ రోజు నుంచి ప్రతి రోజూ, ఆమె వుంటోన్న రూమ్ డోర్స్ కొడుతూ, శబ్దాలు చేసేవారట.!
విషయం ముదిరి పాకాన పడ్డంతో, దర్శకుడికి ఫిర్యాదు చేస్తే.. ఆ తర్వాత షూటింగ్ స్పాట్‌లో కొందరు, తనను అనవసరంగా తాకారంటూ వాపోయింది ఆ సినీ నటి. ఆమె పేరు విచిత్ర. ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలే పోషించిందామె.
ఈ మధ్యనే బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ గురించి బాగా చెప్పారు. దాన్ని సినిమా యూనిట్ ఇంకా బాగా ప్రమోట్ చేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు బాలకృష్ణ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి మీద ‘బ్యాడ్ టచ్’ అంటూ ట్రోలింగ్ చేశారు.
ఇంకేముంది.? చిరంజీవి అభిమానులు, బాలకృష్ణ మీద విచిత్ర చేసిన ఆరోపణల్ని హైలైట్ చేస్తూ, ట్రోల్ చేయడం షురూ చేశారు. ఇంతకీ, విచిత్ర ఆరోపణల్లో నిజమెంత.? ఆమె చెప్పింది నిజమా.? కాదా.? అంటే, ప్చ్.. నిజమనీ అనలేం.. కాదనీ చెప్పలేం.!
సంచలనాల కోసం కొందరు ఈ తరహా ఆరోపణలు చేయడం మామూలే. అయితే, ‘భలేవాడివి బాసూ’ సినిమా సమయంలో పడ్డ ఇబ్బందికి సంబంధించి, అప్పట్లో ఆమె గట్టిగానే ఫైట్ చేసింది. అయితే, యాక్షన్ కొరియోగ్రాఫర్ గురించే ఫైట్ చేసింది అప్పట్లో విచిత్ర. కానీ, ఇప్పుడు నేరుగా బాలకృష్ణ మీద విచిత్ర ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.