Switch to English

‘వాల్మీకి’ని వెనక్కి నెట్టిన ‘గ్యాంగ్‌ లీడర్‌’.. రీజనేంటంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పెద్ద సినిమాలు కావొచ్చు, చిన్న సినిమాలు కావొచ్చు ఓ అండర్‌స్టాండింగ్‌తో వుంటే అది ఆయా సినిమాలకే కాదు, మొత్తంగా సినీ పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ, హీరోలు బేషజాలకు పోవడం.. నిర్మాతలు అత్యుత్సాహం ప్రదర్శించడం వెరసి.. ఒకే రోజు రెండు మూడు సినిమాలు, ఒక్కోసారి అరడజను సినిమాలు విడుదలైపోతూ.. అందులో కొన్ని సినిమాలు అడ్రస్‌ కోల్పోతుంటాయి.

అసలు విషయానికొస్తే, వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్మీకి’ వెనక్కి వెళ్ళింది. నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శక్తవంలో రూపొందిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా యధాతథంగా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి, ఈ రెండు సినిమాల్నీ ఒకే రోజు విడుదల చేయాలనుకున్నారు. ‘మేమిద్దరం ఒకరికొకరం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకుంటాం.. రెండు సినిమాలూ విజయవంతమవ్వాలి..’ అంటూ అటు వరుణ్‌, ఇటు నాని సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

ఏమయ్యిందోగానీ, ఈ రెండు సినిమాల నిర్మాతలూ ఒక్క చోట కూర్చుని చర్చించుకున్నారు. ప్రొడ్యూసర్స్‌ గిల్ట్‌ కూడా రంగంలోకి దిగింది. చర్చోపచర్చల అనంతరం ‘వాల్మీకి’ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. నిజానికి నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాతో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అయితే, ‘సాహో’ ఆగస్ట్‌ 15న కాకుండా ఆగస్ట్‌ 30కి పోస్ట్‌ పోన్‌ కావడంతో ‘ప్రభాస్‌ అన్న’కి సైడిచ్చేశాడు తమ్ముడు నాని.

ఈ క్రమంలోనే నానికి లైన్‌ క్లియర్‌ చేస్తే బెటరని కొందరు పెద్దలు సూచించడంతో ‘వాల్మీకి’ టీమ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, కొందరు పెద్దలు బలవంతంగా ‘వాల్మీకి’ని వెనక్కి నెట్టేశారంటూ సోషల్‌ మీడియాలో గుసగుసలు విన్పిస్తున్నాయి. కంటెంట్‌ మీద నమ్మకం లేకనే ‘వాల్మీకి’ని వెనక్కి పంపించడానికి ఒప్పుకున్నారా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి నెగెటివ్‌ ప్రచారం సోషల్‌ మీడియాలో సర్వసాధారణమేననుకోండి. అది వేరే సంగతి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...