ప్రేమ ఇష్క్ కాదల్ వంటి అభిరుచి ఉన్న చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ సాధినేని. ఆ తర్వాత కూడా కొన్ని మంచి చిత్రాలు చేసినా సరైన విజయం దక్కలేదు. అయితే తెలుగులో వెబ్ సిరీస్ లు ఊపందుకున్నాక సేనాపతి, దయ వంటి సిరీస్ లతో తన పనితనాన్ని చూపించాడు.
ఈ సిరీస్ లతో పవన్ కు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ కోసం పవన్ సాధినేని ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఐదేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి పనిచేయాలట. అందులో హరికృష్ణను కీలక రోల్ కోసం కూడా అనుకున్నారట. అయితే హరికృష్ణ హఠాన్మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అయితే ఇప్పుడు చేస్తోంది అదే ప్రాజెక్టా లేక కొత్తదా అన్నది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బింబిసార 2 కూడా చేయాల్సి ఉంది.