Switch to English

కరోనా ముంచెత్తుతున్న వేళ ‘దైవ దర్శనం’ సబబేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

జూన్‌ 8 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేసేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 8 నుంచి చాలా వెసులుబాట్లు రానున్నాయి. నిజానికి, లాక్‌ 3 నుంచే పెద్దయెత్తున ‘సడలింపులు’ పుట్టుకొచ్చాయి. అసలు కథ అప్పుడే మొదలయ్యింది కూడా.! మూడో లాక్‌డౌన్‌, ఆ తర్వాత నుంచే దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మరింత పెరుగుతూ వచ్చింది. నిజానికి, ఇంకా ‘పీక్‌ స్టేజ్‌’కి చేరుకోలేదని కేంద్రమే చెబుతోంది.

ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, ‘పీక్‌ స్టేజ్‌’ ఇంకెలా వుండబోతోంది.? ఆ సంగతి పక్కన పెడితే, జూన్‌ 8వ తేదీ నుంచి ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ‘దైవదర్శనం’ లభించనుంది. సుమారు మూడు నెలల తర్వాత దైవదర్శనమన్నమాట. ప్రధాన దేవాలయాలన్నీ ఇప్పటికే తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. జూన్‌ 8 నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రయోగాత్మకంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అయితే, తొలుత టీటీడీ సిబ్బంది, ఆ తర్వాత తిరుపతి నగర వాసులకీ.. ఆ తర్వాత చిత్తూరు వాసులకీ.. ఇలా క్రమక్రమంగా అందరికీ అవకాశం కల్పిస్తారన్నమాట. కానీ, ఇక్కడ ఓ ప్రశ్న సగటు భక్తుడ్ని వెంటాడుతోంది.

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కొన్ని ఆంక్షలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోకి వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి.. అదీ ఆన్‌లైన్‌ విధానంలో. అలాంటప్పుడు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడమెలా సాధ్యమవుతుంది.? ఏమో, ముందు ముందు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయమై సడలింపులు వస్తాయేమో.! ఇతర రాష్ట్రాల సంగతి తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే, తిరుపతి వెళ్ళాలంటే.. ప్రస్తుతం ఆపసోపాలు పడాల్సి వస్తుంది. రవాణా సౌకర్యం అంతంతమాత్రంగానే వుంది. పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తున్నాయి.

ఇక, దర్శనం సందర్భంగా ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ కోసం మార్కింగ్‌ అయితే చేశారుగానీ.. దాన్ని ఎంతమంది పాటిస్తారు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే వున్నాయి. ఇది ఒక్క తిరుమలకే కాదు.. రాష్ట్రంలో, ఆ మాటకొస్తే.. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకీ ఇదే సమస్య ఎదురవుతుంది. దేవాలయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సహా అనేక కీలక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయా.? అన్న చర్చ ఓ వైపు జోరుగా సాగుతోంటే, ‘దైవదర్శనంతో అయినా.. మానసిక ప్రశాంతత లభిస్తుంది..’ అన్న భావన చాలామంది భక్తుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...