Switch to English

కేసీఆర్‌పై మళ్ళీ గెలిచిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో గులాబీ బాస్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారంటూ కేసీఆర్‌ ‘ఫత్వా’ జారీ చేసినట్లు వ్యవహరిస్తే, హైకోర్టు మొట్టికాయలేసింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మరోపక్క, తమ జీతాల విషయమై ఆర్టీసీ కార్మికులు కోర్టును ఆశ్రయిస్తే, ‘తక్షణం జీతాలు చెల్లించాలి..’ అంటూ న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం.

న్యాయస్థానం ఆదేశాలతో సోమవారం లోగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందనున్నాయి. మరోపక్క, ఆర్టీసీ ఎండీ నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తోంది. అదొక్కటే కాదు, ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సి వుంది ప్రభుత్వం. ఇందుకోసం పలువురు మంత్రులు, అధికారుల పేర్లను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేయాల్సి రావడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరించినప్పుడే ప్రభుత్వం సానుకూలంగా వారి సమస్యల పట్ల స్పందించి వుంటే.. ప్రజలకు ఇప్పుడు ఈ సమస్యలు వచ్చి వుండేవి కావు.

ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యా సంస్థలకు కేసీఆర్‌ సర్కార్‌ సెలవులు ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. విద్యార్థి లోకం, కేసీఆర్‌ సర్కార్‌ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఒక్క ఆర్టీసీ సమ్మె.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసింది. మరీ ముఖ్యంగా గులాబీ బాస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ వ్యవహారంతో పూర్తిగా తన ఇమేజ్‌ని చెడగొట్టుకున్నట్లయ్యిందని టీఆర్‌ఎస్‌ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తోన్న పరిస్థితి.

‘ఇలాంటి మొండి వైఖరితో ప్రభుత్వానికీ, పార్టీకీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. గత ఐదేళ్ళలో లేని అహంకారం, ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కావడంలేదు..’ అంటూ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తన సన్నిహితుల వద్ద వాపోవడం, ఆ తర్వాత.. అది స్వయంగా కేసీఆర్‌ దృష్టికి వెళ్ళడంతో సదరు సీనియర్‌ నేతపైనా కేసీఆర్‌ గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరుస విజయాలు దక్కుతుండడం విశేషమే మరి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...