ఓ స్టూడెంట్ చెడ్డోడు అయితే, ఆ పాపం ఆ విద్యార్థికి చదువు చెప్పిన టీచర్లదేనట. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరపైకి తెచ్చిన సరికొత్త సిద్ధాంతమిది. అవునా.? అలాగైతే, మంచి టీచర్ల క్లాసుల్లోనూ చెడ్డ విద్యార్థులు ఎందుకు వుంటారు.? చెడ్డ టీచర్లు వున్న క్లాసులోంచి కూడా మంచి విద్యార్థులెలా పుడతారు.? ఇవన్నీ రామ్గోపాల్ వర్మకి తెలియక కాదు.
పబ్లిసిటీ పైత్యంతో నిత్యం కొట్టుమిట్టాడే రామ్గోపాల్ వర్మకి, ‘టీచర్స్ డే’ కూడా భలేగా ఉపయోగపడిందంతే. టీచర్స్ డే.. అంటే గురుపూజోత్సవం అనే విషయాన్ని మర్చిపోయి, అదేదో టీచర్స్ బ్రాండ్ లిక్కర్ అనే భానవలో.. అదే మత్తులో ట్వీట్లు వరసగా వేసేశాడు రామ్గోపాల్ వర్మ.
టీచర్లు తనను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం వల్లే తాను మంచి వాడ్ని కాలేకపోయాననీ, తనలాంటి బ్యాడ్ స్టూడెంట్ టీచర్లకు ఎలా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాడని ప్రశ్నించాడు ఈ సంచలన దర్శకుడు. దర్శకత్వంలో రామ్గోపాల్ వర్మ సంచలనాలు ఎప్పుడో అటకెక్కాయి. సంచలన వివాదాల రామ్గోపాల్ వర్మగా మిగిలిపోయాడిప్పుడాయన.
అడపా దడపా తానూ దర్శకత్వం వహిస్తున్నానని అన్పించుకోవడానికి ఏవేవో సినిమాలు తీస్తున్న వర్మ, పవిత్రమైన గురుపూజోత్సవం నాడు.. విద్యాబుద్ధులు నేర్పే టీచర్ల సమాజానికి శుభాకాంక్షలు చెప్పకపోయినా ఫర్లేదుగానీ, ‘టీచర్స్ లిక్కర్’ పేరుతో అవమానించడమే దారుణం. టీచర్స్ లిక్కర్ తాగి టీచర్స్ డేని టీచర్స్ సెలబ్రేట్ చేసుకుంటారా.? అంటూ వర్మ వేసిన ప్రశ్న అయితే మరీ జుగుప్సాకరం. సమాజంలో టీచర్లకి చాలా చాలా గౌరవం వుంది. వర్మ ఏదో తన పబ్లిసిటీ కోసం గురు పూజోత్సవాన్ని అవమానపరిస్తే మాత్రం.. గురువులకున్న గౌరవం తగ్గిపోతుందా.? ఆయన స్థాయి అంతే.. అక్కడే ఆగిపోయిందంతే.!
965344 592439Spot up for this write-up, I seriously believe this web site needs a whole lot far more consideration. Ill apt to be once far more to learn additional, appreciate your that information. 675942