Switch to English

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది నేతలు. నిజానికి, గత కొన్నేళ్ళుగా తెలుగుదేశం పార్టీ బాద్యతల్ని యంగ్‌ టైగర్‌ తీసుకోవాలనే నినాదాలు టీడీపీలో గట్టిగా విన్పిస్తున్నాయి.

కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. ‘యంగ్‌ టైగర్‌’కి మద్దతుగా మాట్లాడుతున్నవారందర్నీ పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారు. తద్వారా టీడీపీ రోజురోజుకీ తన స్థాయిని తగ్గించేసుకుంటోంది. ఇంతకీ, నందమూరి బాలకృష్ణ మాటేమిటి.? హిందూపురం ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచి, రాజకీయంగా తన ఉనికిని చాటుకుంటున్నా.. టీడీపీలో ఎవరూ ఆయన్ని ‘లీడర్‌’గా చూడటంలేదు. కారణం, బావ చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటారు తప్ప.. టీడీపీని లీడ్‌ చేసేంత సీన్‌ బాలయ్యకు లేదన్న గట్టి నమ్మకమే.

అయితే, ఇక్కడ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ప్రస్తుతం రాజకీయాల గురించిన ఆసక్తి ఏమాత్రం లేదు. గతంలో తన తండ్రి హరికృష్ణ ఒత్తిడితో, ఇతరత్రా అనేక రకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసిన మాట వాస్తవం. అప్పట్లో యంగ్‌ టైగర్‌ సన్నిహితులుగా వున్న చాలామంది వేరే పార్టీల్లో వున్నారు. దానికీ చాలా కారణాలున్నాయి. టీడీపీలో యంగ్‌ టైగర్‌కి తగిన గౌరవం ఇవ్వకపోవడంతో వారంతా టీడీపీని వీడారు.

మొన్నటి ఎన్నికల్లో అయితే, ‘ఎన్టీఆర్‌ అవసరం పార్టీకి లేదు..’ అని ఓ యువనేత వ్యాఖ్యానించడం, ఆయన ఓడిపోవడమూ జరిగిపోయాయి. ఆయనెవరో కాదు, నందమూరి – నారా కుటుంబాలకి బంధువే. ఇలాంటి అవమానాలు యంగ్‌ టైగర్‌కి చాలానే ఎదురయ్యాయి. తన ప్రమేయం లేకుండానే తనను టీడీపీలో కొందరు టార్గెట్‌ చేసిన వైనంపై యంగ్‌ టైగర్‌కీ మనసులో బాధ వుండకుండా వుంటుందా.?

తమ సోదరి ఆ మధ్య కూకట్‌పల్లి నుంచి పోటీ చేసినా, కళ్యాణ్‌రామ్ గానీ, ఎన్టీఆర్‌గానీ ప్రచారానికి వెళ్ళకపోవడం అందర్నీ అప్పట్లో విస్మయానికి గురిచేసింది. ‘టీడీపీకి దూరంగా వుండటమే బెటర్‌..’ అని యంగ్‌ టైగర్‌ అభిమానులు అప్పట్లో సూచించారు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకి.

మొత్తమ్మీద, టీడీపీలో అంతర్గత రాజకీయాలు ఎలా వున్నా, తాత స్వర్గీయ ఎన్టీఆర్‌ అంటే యంగ్‌ టైగర్‌కి అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు యంగ్‌ టైగర్‌ చేపడ్తారని చాలామంది ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాలంటే.. దానికి చాలా పెద్ద కథ నడవాలి. కానీ, సినిమా కెరీర్‌ని త్యాగం చేసి యంగ్‌ టైగర్‌ రాజకీయాల్లోకి రాగలడా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఇదిలా వుంటే, తన చుట్టూ జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారంపై యంగ్ టైగర్ అసహనంతో వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కులాన్ని ఆపాదించేందుకు ఓ సెక్షన్ మీడియా పడుతున్న తపన నేపథ్యంలో యంగ్ టైగర్ సరైన సమయంలో సరైన సమాధానం ఇచ్చే ఆలోచనలో వున్నాడట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...