బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారంలో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. నీ ఇల్లు బంగారం కాను టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా గోల్డ్ మైనింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు పవర్ యాక్సెస్ సాధించిన వారికి పవర్ టూల్స్ లభిస్తాయి. దానికోసం బిగ్ బాస్ అడిగింది త్యాగం చేయాల్సి ఉంటుంది.
స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రకారం శ్రీరామ్ చంద్రకు పవర్ యాక్సెస్ లభించింది. అప్పుడు లభించిన పవర్ టూల్ ను తన వద్దే ఉంచుకుంటానని బిగ్ బాస్ కు తెలిపాడు శ్రీరామ్. కానీ బయటకు వచ్చి ఈ పవర్ టూల్ కావాలంటే మీ వద్ద ఉన్న గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని చెబుతాడు.
మిగతా వారు దాని గురించి ఆలోచిస్తుండగా రవి తాను ఆ పవర్ టూల్ ను తీసుకుంటానని అంటాడు. తర్వాత అయ్యో అనుకుంటాడు. శ్రీరామ్ చంద్రతో పాటు మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా గట్టిగా నవ్వేస్తారు. దీంతో శ్రీరామ్ చంద్ర గోల్డ్ కాయిన్స్ కోసం రవిని బకరా చేసాడని అర్ధమవుతోంది.
275587 327503This is going to be an excellent internet website, will you be involved in doing an interview regarding how you developed it? If so e-mail me! 724062
998789 468260I recognize there exists a fantastic deal of spam on this blog website. Do you require support cleaning them up? I can help among courses! 430273