Siddharth: హీరో సిద్ధార్ద్ (Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) మధ్య ప్రేమ ఉందా..? కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అనేక ఊహాగానాలు వెల్లడవుతున్నాయి. కొన్ని ఈవెంట్స్, పలు రెస్టారెంట్లకు కలిసి వెళ్లారు. దీంతో అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
అయితే.. వీరిద్దరూ ఈ గాసిప్స్ ను ఖండిస్తూనే వచ్చారు. ప్రస్తుతం ఓ సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్నారు సిద్ధార్ద్. ఇక్కడ.. ‘అదితీరావు హైదరీ మీరు ప్రేమలో ఉన్నారా..? మీరు వివాహం చేసుకోనున్నారlo ప్రచారం జరుగుతోంది. క్వీన్ ఆఫ్ మై హార్ట్ అనే పోస్టు కూడా చేశారు కదా..! దీనిపై మీ అభిప్రాయం ఏంట’నే ప్రశ్న సిద్ధార్ద్ కు ఎదురైంది.
దీనికి సిద్ధార్ద్.. ‘నాకింకా పెళ్లి ఫిక్స్ కాలేదు. ఇవన్నీ ఊహాగానాలే. మీరు చెప్తున్న పోస్ట్ అదితీ పుట్టినరోజున పెట్టాను. కారణం ఏంటంటే.. ఆమె ఎంతోమంది హృదయాలకు యువరాణి (అదితి ఫ్యాన్స్ ను ఉద్దేశించి)’ అని అన్నారు. 2021లో వచ్చిన మహాసముద్రం సినిమాలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. అప్పటినుంచీ వీరిద్దరి మధ్యా స్నేహం చిగురించింది.