Salaar: ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ (Salaar) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22న సలార్ విడుదలవుతోందని ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మూడు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. దీంతో సలార్ పై ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ ను డైనొసొరస్ తో పోల్చి ప్రముఖ నటుడు టినూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకర్షించాయి.
కేజీఎఫ్ సిరీస్ తో స్టార్ డైరక్టర్ పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియారెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
I nded to to thabk yoou ffor this excellent read!!
I definitely enjoyed every little bitt of it.
I hae got you book-marked tto ccheck oout new
thjngs yyou post…