Heroine: ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటి, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) ఓ సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో హీరో పెదవులు తనకు తాకడంతో చాలా అసౌకర్యానికి గురైనట్టు చెప్పుకొచ్చింది. ‘నో కిస్ పాలసీకి తగ్గట్టు ఉన్న నేను అలా జరగ్గానే నా రూమ్ లోకి వెళ్లిపోయాను. చాలా వికారంగా అనిపించింది. వాంతి వచ్చేసింది. ఆ సమయంలో నా నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండునని అనిపించింది’,
‘అయితే.. ఆ హీరో కావాలని అలా చేయలేదు. అనుకోకుండానే జరిగింది. ఆ సంఘటన తర్వాత హీరో క్షమాపణలు కూడా చెప్పాడు’ అని చెప్పుకొచ్చింది. అయితే.. అది ఏ సినిమా, హీరో ఎవరనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రవీనాటాండన్. మొహ్రా సినిమాలో తూ చీజ్ బడీహై మస్త్.. మస్త్ పాటతో ఎంతో పేరు తెచ్చుకుంది. ఈమధ్య వచ్చిన కేజీఎఫ్2లో రమికా సేన్ పాత్రలో నటించి మెప్పించింది.
A wide range of cryptocurrencies and fiat payment methods is
anticipated at all blackjack casinos.