Switch to English

కేసీఆర్‌ నజర్‌: తెలంగాణలో కర్నాటక మోడల్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కర్నాటకపై భారతీయ జనతా పార్టీ ఫోకస్‌ మరింత గట్టిగా పెట్టింది. రేపో మాపో, కర్నాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోనుంది. 10 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసేయడంతో, దాదాపుగా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయినట్లే. విదేశాల్లో వున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తిరిగొచ్చేసరికి.. పదవి ఊడగొట్టుకోవాల్సిందే. ఇంకో మార్గం అయితే కన్పించడంలేదు. ఈ మొత్తం వ్యవహారానికి బీజేపీనే కారణమన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

వాస్తవానికి, కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లను బీజేపీనే సాధించింది కానీ మెజార్టీని అందుకోలేకపోయింది. అయినాగానీ, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చిన వెంటనే యడ్యూరప్ప పదవి ఊడిపోయింది. యడ్యూరప్పని ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు అప్పట్లోనే కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలని లాగే ప్రయత్నం బీజేపీ చేసింది. అయితే, అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తన మిత్రుడు కుమారస్వామిని ఆదుకున్నారు.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు హైద్రాబాద్‌లో ఆశ్రయం ఇవ్వడం ద్వారా.

కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బీజేపీ తాజా వ్యూహానికి కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం విలవిల్లాడుతోంది. దక్షిణాదిలో సత్తా చాటేందుకు కర్నాటకని ప్రయోగశాలగా మార్చేసింది బీజేపీ. అంతకు ముందే తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం సృష్టించి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయించుకున్న బీజేపీ, కర్నాటక తర్వాత తెలంగాణపై పూర్తి ఫోకస్‌ పెట్టబోతోందట.

తెలంగాణలో స్పష్టమైన మెజార్టీతో కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. పైగా, తెలంగాణలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పే పరిస్థితీ లేదు. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లను సొంతం చేసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌కి పెద్ద షాకే ఇచ్చింది. టీఆర్‌ఎస్‌లో అంతర్గత కల్లోలం సృష్టించి, పార్టీ రెండుగా విడిపోయేలా చేయాలన్నది బీజేపీ వ్యూహం. అందుకు స్వయానా కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావుని పావుగా ఉపయోగించుకోబోతోంది బీజేపీ. అయితే, హరీష్‌రావు అంత రిస్క్‌ చేస్తారా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. బీజేపీ మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కొనసాగకూడదన్న కసితో వున్నట్లే కన్పిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...