Switch to English

టీవీ9 రవిప్రకాష్‌ని దాచిపెడ్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

రవిప్రకాష్‌, టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగింపబడ్డా, ఇంకా ఆయన ఆ సంస్థలో వాటాదారుగానే చెలామణీ అవుతున్నారు. ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. టీవీ9 రవిప్రకాష్‌ ఆచూకీ ఎక్కడ? అని సోషల్‌ మీడియాలో చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలుగు మీడియాలో సైతం ఎవరికీ టీవీ9 రవిప్రకాష్‌ ఆచూకీ దొరకడంలేదు. చాలామంది సన్నిహితులున్నారు ఆయనకి రాజకీయ రంగంలోనూ, మీడియా రంగంలోనూ..! చివరికి సినీ రంగంతోనూ రవిప్రకాష్‌కి సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెల్సిందే.

ఎంతమంది సన్నిహితులు వుంటే ఏం లాభం? ఎవరూ ఇప్పుడు రవిప్రకాష్‌ ఆచూకీ చెప్పడంలేదు. పోలీసులకు సమాధానమిచ్చేందుకోసం రవిప్రకాష్‌ తరఫు లాయర్‌ కొంత గడువుని కోరినప్పటికీ, పోలీసులు మాత్రం ఆయన కోసం వెతుకుతూనే వున్నారు. ‘కాస్తంత వెసులుబాటు’ దొరికితే, ఈలోగా వివాదాన్ని చల్లార్చుకోవచ్చని, తెరవెనుక సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చనీ రవిప్రకాష్‌ భావిస్తున్నారంటూ ఓ గాసిప్‌ బయల్దేరింది. సంస్థ యాజమాన్యంతో రవిప్రకాష్‌ మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆ గాసిప్‌ సారాంశం.

ఇదిలా వుంటే, రవిప్రకాష్‌ ముంబైకి పారిపోయారంటూ మరో ప్రచారం తెరపైకొచ్చింది. ఇన్నాళ్ళూ రవిప్రకాష్‌, ఏ రాజకీయ పార్టీకి అయితే వత్తాసు పలికారో ఆ రాజకీయ పార్టీనే ఆయన్ను వ్యూహాత్మక్మకంగా ముంబైలో వుండాల్సిందిగా సూచించిందని మీడియా వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే, ఒకటీ అరా పార్టీలు మినహాయిస్తే, అన్ని రాజకీయ పార్టీలతోనూ రవిప్రకాష్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో రవిప్రకాష్‌ని ముంబైలో దాక్కోమన్నదెవరు.? దాచిందెవరు? అనేదానిపై రకరకాల ప్రచారాలు జరగడం మామూలే.

‘నన్నెవరూ అరెస్ట్‌ చేయలేదు.. చేయబోరు..’ అని ‘ఫోర్జరీ వివాదం’ తెరపైకొచ్చాకే రవిప్రకాష్‌ దర్జాగా టీవీ9లో కూర్చుని లైవ్‌లో కథలు చెప్పారు. తన నిజాయితీకి సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు, మీడియా సంస్థలకి నీతులూ చెప్పారు. మరి, ఆ నీతులు చెప్పిన రవిప్రకాష్‌, పోలీసుల యెదుట హాజరై విచారణకు సహకరించాలి కదా! అలా టీవీ9 లైవ్‌లో రవిప్రకాష్‌ కన్పించడమూ మరో పెద్ద తప్పిదంగా మారిపోయిందతనికి. ఆ వెంటనే అతన్ని పీకేసినట్లు టీవీ9 సంస్థ ప్రకటించింది మరి.

టీవీ9 నుంచి తొలగించబడినట్లుగానే, రవిప్రకాష్‌ అరెస్ట్‌కి కూడా రంగం సిద్ధమవుతోందా? అనే అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. అప్పుడూ రవిప్రకాష్‌ మాట చెల్లలేదు కాబట్టి, ఇప్పుడూ అదే జరుగుతుందనీ, అది తెలిసే రవిప్రకాష్‌ పారిపోయాడని మీడియా సర్కిల్స్‌లోని పలువురు మీడియా ప్రతినిథులు మాట్లాడుకుంటున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...