Switch to English

మళ్ళీ ప్రధానిగా మోడీ.. చాలా కష్టమేగానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధాని పీఠమెక్కుతారో లేదో మే 23న వెల్లడయ్యే ఫలితాలతో తేలిపోతుంది. అయితే, కమలనాథుల్లో కంగారు కాస్త ఎక్కువైనట్లుంది. ఆందోళనలో ‘వాస్తవాల్ని’ తొందరపడి ముందే చెప్పేస్తున్నారు. దేశంలో మోడీ వ్యతిరేక గాలి వీస్తోందన్న విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా ఒప్పేసుకుంటున్నారు. అయితే, నరేంద్ర మోడీకి ఓ అడ్వాంటేజ్‌ లేకపోలేదు. అదే, ఆయనకు పోటీగా నిలబడే ‘నాయకుడు’ ఇంకొకరు జాతీయ స్థాయిలో లేకపోవడం.

కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నప్పటికీ నరేంద్ర మోడీతో పోల్చితే ఆయన ఇమేజ్‌ అంతంతమాత్రమే. గతంతో పోల్చితే రాహుల్‌ ఇమేజ్‌ కొంత పెరిగిన మాట వాస్తవం. కానీ, అది నరేంద్ర మోడీతో పోటీపడగలిగే స్థాయిలో మాత్రం లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలే ఒప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మమతా బెనర్జీ ఇమేజ్‌ దేశవ్యాప్తంగా బాగా పెరిగింది. దాంతో, కాంగ్రెస్‌ కూడా మమతా బెనర్జీ పట్ల కొంత సానుకూలంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ఎప్పుడైతే మమతా బెనర్జీ విషయంలో సానుకూలంగా వ్యవహరించడం మొదలు పెట్టిందో, బీజేపీలో గుబులు బయల్దేరింది. దేశ రాజకీయాల్లో అతి కొద్ది మంది ‘క్లీన్‌ పొలిటీషియన్స్‌’లో మమతా బెనర్జీ ఒకరు. ఇందిరాగాంధీ తర్వాత మమతా బెనర్జీని రాజకీయాల్లో ఐరన్‌ లేడీగా భావిస్తారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఓ మహిళ అని కూడా చూడకుండా, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ విమర్శలు హద్దు దాటి మమతపై చేయడం బీజేపీకి నెగెటివ్‌గా మారింది. అదే, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ముంచేస్తుందని బీజేపీ కురువృద్ధులు అభిప్రాయపడుతున్నారు.

‘బీజేపీలో ఇలాంటి పరిస్థితిని ఇంకెప్పుడూ చూడలేదు. నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరినీ తన ప్రత్యర్థిలాగానే చూస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ చేతిలో నైతిక ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ చేతిలో నరేంద్ర మోడీకి నైతిక ఓటమి ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే.. కేజ్రీవాల్‌ చేతిలో నరేంద్ర మోడీకి నైతిక ఓటమి ఎదురయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకీ ప్రధానికీ సంబంధమేంటి? అని ఊరుకోకుండా, నరేంద్ర మోడీ ఆ ఎన్నికలు తనకూ, ఆయా రాష్ట్రాల్లోని బలమైన రాజకీయ నాయకులకీ మధ్యన అన్నట్లు భావించడంతోనే ఈ సమస్య వచ్చింది.

బీహార్‌లో నితీష్‌కుమార్‌ని తనవైపుకు తిప్పుకున్నట్లుగా నరేంద్ర మోడీ గనుక ఫలితాల తర్వాత కేసీఆర్‌, జగన్‌ లాంటోళ్ళను తనవైపుకు తిప్పుకుంటే మళ్ళీ ప్రధాని పీఠమెక్కడానికి అవకాశాలున్నాయి. అయితే, ఆ స్థాయిలో సమీకరణాలు మార్చడానికైనా తగిన బలం కావాలి కదా!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...