Switch to English

Ravanasura Review: రావణాసుర మూవీ రివ్యూ – బిలో యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

Critic Rating
( 2.25 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,455FansLike
57,764FollowersFollow
Movie రావణాసుర
Star Cast రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షనాగార్కర్
Director సుధీర్ వర్మ
Producer అభిషేక్ నామ
Music హర్షవర్ధన్ రామేశ్వర్
Run Time 2గం 21నిమి
Release ఏప్రిల్ 7, 2023

Ravanasura Review: మాస్ మహారాజా రవితేజ నుండి వచ్చిన మరో ఆసక్తికర చిత్రం రావణాసుర. రవితేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడంతో ఈ చిత్రంపై ఆటోమేటిక్ గా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రోమోలతో ఆకర్షించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

రవితేజ ఒక జూనియర్ లాయర్. సీనియర్ లాయర్ ఫారియా అబ్దుల్లా వద్ద పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా మేఘా ఆకాష్ ఇచ్చిన ఒక కేసుతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఒక మర్డర్ కేసులో సంపత్ రాజ్, మేఘా ఆకాష్ తండ్రి ముద్దాయిగా ఉంటాడు. దాని తర్వాత పలు భయంకరమైన, ఒళ్ళు గగుర్పొడిచే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి.

ఎవరు ఈ మర్డర్స్ చేస్తోంది? ఇంత దారుణంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? తర్వాత ఏం జరుగుతుంది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

రవితేజ ఎప్పటిలానే తనదైన శైలిలో పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫారియా అబ్దుల్లాతో రవితేజకు మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. ఇక రవితేజ సినిమా అంతటా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. విభిన్నమైన షేడ్స్ ఉన్న రవితేజ పాత్ర కచ్చితంగా ఫ్యాన్స్ తో పాటు అభిమానులకు కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

సుశాంత్ మరో ఆసక్తికర పాత్ర చేసాడు. తను బాగానే చేసాడు కానీ ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్ తర్వాత ఉండదు. సంపత్ రాజ్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, శ్రీరామ్, జయరాం, దక్ష నాగర్కర్, రావు రమేష్, ఇంకా తదితరులు కీలక పాత్రలు చేసారు. వాళ్లకు కథకు అనుగుణంగా వచ్చి వెళ్తారు.

సాంకేతిక నిపుణులు:

తనకు ఇచ్చిన కథను ది బెస్ట్ గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఫస్ట్ హాఫ్ వరకూ ఆసక్తికరంగా ఉండేలా డిజైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బకొట్టేసింది. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ఫ్యాక్టర్ పూర్తిగా నీరుగారిపోయింది. స్క్రీన్ ప్లే కూడా అస్తవ్యస్తంగా తయారైంది. రవితేజ చేసే పనులను జస్టిఫై చేసే కారణాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. దాంతోనే ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అవుతాడు. వీటికి తోడు కొన్ని మర్డర్ సీన్స్ ను మరింత భయంకరంగా, జుగుప్సాకరంగా చూపించారు. అంత అవసరం ఏముందో అర్ధం కాదు.

ఈ చిత్రానికి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఒకటి. టెన్షన్ బిల్డ్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉపయోగపడింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు.

ప్లస్ పాయింట్స్;

  • రవితేజ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్;

  • స్క్రీన్ ప్లే
  • సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం
  • ఊహించదగ్గ సెకండ్ హాఫ్

చివరిగా:

అద్భుతమైన సైకో థ్రిల్లర్ అయ్యే లక్షణాలు ఉన్న రావణాసుర ఒక రొటీన్, యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ మీద తీసుకున్న శ్రద్ధ సెకండ్ హాఫ్ మీద కూడా తీసుకునే ఉంటే బాగుండేది. మీరు రవితేజ ఫ్యాన్ అయితే ఒకసారి చూడవచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...