తన కొత్త సినిమా పనుల్లో భాగంగా ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అమెరికాలో వున్నాడు. తన సినిమాల్ని ప్రమోట్ చేయడంలో రానా ఎప్పుడూ ముందుంటాడు, అదే సమయంలో, ఇతర సినిమాల్ని ప్రమోట్ చేయడంలోనూ తనవంతు కృషి చేస్తుంటాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు రానా.
తనకిష్టమైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా చూసేందుకు అమెరికాలో తాను సిద్ధంగా వున్నానని ఆ వీడియోలో పేర్కొన్నాడు కూడా. మరోపక్క, రానా ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడనీ, కిడ్నీ సమస్య కారణంగా ఎదురవుతున్న సమస్య మరింత తీవ్రం కావడంతో, కిడ్నీ మార్పిడి చికిత్స కోసమే అమెరికాకి రానా వెళ్ళాడనీ, అక్కడ ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగిందనీ.. ఇలా రకరకాల గాసిప్స్ విన్పిస్తున్నాయి.
రానా కోసం అతని తల్లి కిడ్నీ త్యాగం చేసినట్లు కూడా కొన్ని వెబ్‌సైట్స్‌లో కథనాలు వస్తున్నాయి. అనారోగ్యంపై వచ్చిన వదంతుల్ని గతంలోనే రానా ఖండించాడు. ‘నాన్సెన్స్.. అలాంటివాటిని పట్టించుకోవద్దు.. నేనెలా వున్నానో చూస్తున్నారుగా..’ అని పలుమార్లు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు నెగెటివ్ గాసిప్స్‌పై.
తాజాగా, రానా ‘డియర్ కామ్రేడ్’ కోసం విడుదల చేసిన వీడియో ద్వారా తాను పూర్తి ఆరోగ్యంతో వున్నాననే సంకేతాల్ని పరోక్షంగా పంపించినట్లయ్యింది. కిడ్నీ మార్పిడిదాకా వ్యవహారం వెళ్ళిందంటే, ఏ వ్యక్తి అయినా ఇంత ఆరోగ్యంగా వుండే పరిస్థితి చూడగలమా? ఛాన్సే లేదు. సో, రానా అనారోగ్యంపై వస్తున్నవన్నీ ఫేక్ గాసిప్స్ మాత్రమే.
176597 84050I truly prize your piece of function, Great post. 136829
20586 501582Rattling exceptional information can be discovered on internet blog . 538368
98027 964385Id always want to be update on new content material on this website , saved to fav! . 314268
604923 537066Dead pent topic matter, thanks for entropy. 707408
876356 936995Correct humans speeches should seat as nicely as memorialize about the groom and bride. Beginer sound system around rowdy locations should always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. very best man speeches brother 814712