Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం వేల్స్ యూనివర్శిటీ (Vels University) స్నాతకోత్సవంలో భాగంగా రామ్ చరణ్ ను డాక్టరేట్ తో గౌరవించింది. నేడు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. అభిమానులు, ప్రముఖుల హర్షధ్వానాల మధ్య రామ్ చరణ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కళా రంగంలో రామ్ చరణ్ చేస్తున్న సేవలకుగానూ ఈ గుర్తింపునిచ్చారు.
యూనివర్శిటీ చాన్సలర్, ప్రముఖ నిర్మాత గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజి సీతారామ్ డాక్టరేట్ పట్టాను రామ్ చరణ్ కు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 2006లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి.. ఇప్పుడు రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో.. తండ్రికి తగ్గ తనయుడు అంటూ మెగాభిమానులు సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు.