సూపర్ స్టార్ రజినీకాంత్ 70వ వడిలోకి అడుగుపెట్టాడు. అసలైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు పూర్తిగా దూరమవుతానని తెలిపాడు. ఈ నేపథ్యంలో అన్నాత్తే తన చివరి చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు. అయితే కరోనా రజినీ ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజినీ క్లారిటీ ఇచ్చాడు.
అన్నాత్తే చిత్రాన్ని కూడా అతి కష్టంమీద పూర్తి చేసాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని మొత్తానికి పూర్తి చేసాడు. ఈ సినిమా కంటెంట్ పై విమర్శలు ఎదురైనా కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. అన్నాత్తే సక్సెస్ పై పూర్తిగా హ్యాపీగా ఉన్నాడు రజినీ.
అయితే సూపర్ స్టార్ తర్వాతి చిత్రం ఏంటి? సాధారణంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్రకటించే అలవాటున్న రజినీ నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సినిమాల నుండి సూపర్ స్టార్ రిటైర్ అవ్వనున్నారా?
194759 556170I definitely did not realize that. Learnt one thing new today! Thanks for that. 827546
36517 844689Yeah bookmaking this wasnt a speculative decision outstanding post! . 646601