కెరీర్ మొదలుపెట్టి దశాబ్దం కావొస్తోంది క్యాథెరిన్ కు. ఇప్పటికీ కెరీర్ లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తోంది. అడపాదడపా వచ్చిన అవకాశాలనే చేజిక్కించుకుని ముందుకెళుతోంది. రీసెంట్ గా నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే షూటింగ్ లో కూడా జాయిన్ అయింది.
ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది క్యాథెరిన్. తన కెరీర్ లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే చేసింది. స్టార్ హీరో అల్లు అర్జున్ తో చేసిన రెండు సినిమాలలో కూడా సెకండ్ లీడ్ పాత్రలే. అలాగే రానా సూపర్ హిట్ చిత్రం నేనే రాజు నేనే మంత్రిలో కూడా క్యాథెరిన్ ది సెకండ్ హీరోయిన్ పాత్ర.
అందుకే సినిమాలు హిట్ అవుతున్నా కానీ క్యాథెరిన్ కు వస్తోన్న రెస్పాన్స్ అయితే తక్కువే. ఏదేమైనా సెకండ్ లీడ్ పాత్రలతోనైనా తనకు బ్రేక్ వస్తుందేమోనని చూస్తోంది.