Switch to English

మహేష్‌కి పూరి షాక్‌: ‘జనగనమన’ హీరో ‘కేజీఎఫ్‌’ యష్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో పూరి జగన్నాథ్‌, తన తదుపరి సినిమా కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌ తీస్తానని గతంలోనే ప్రకటించిన పూరి, కథ కూడా ఆల్రెడీ సిద్ధం చేసేసుకున్నాడన్నది తాజా ఖబర్‌. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’పై ఇప్పటికే పూరి నుంచి క్లారిటీ వచ్చేసింది. కథ రెడీ అయిపోయిందనీ, దానికి చిన్న చిన్న మార్పులు చేసి.. ఇంకాస్త భారీతనం అద్దాలన్నది పూరి తాజా ఆలోచన అట. త్వరలోనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరోపక్క, పూరి జగన్నాథ్‌ తాను ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకుంటున్న ‘జన గన మన’ ప్రాజెక్ట్‌ని కూడా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో వున్నాడట. తొలుత ఈ ప్రాజెక్ట్‌ కోసం మహేష్‌ని హీరోగా అనుకున్నాడు పూరి జగన్నాథ్‌. అయితే, కొన్ని కారణాలతో మహేష్‌, పూరిని పక్కన పెట్టేశాడు. ఆ విషయాన్ని పూరి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. ‘ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్టయ్యాక.. మహేష్‌ నన్ను పిలిచినా వెళ్ళేది లేదు’ అని పూరి తేల్చి చెప్పిన విషయం విదితమే. ఆ స్థాయిలో పూరి – మహేష్‌ మధ్య విభేదాలున్నాయి. ఇక, విజయ్‌ దేవరకొండతో పూరి జగన్నాథ్‌ ‘జన గన మన’ తెరకెక్కిస్తాడంటూ ఊహాగానాలు విన్పించాయి.

కానీ, తాజా ఊహాగానాల ప్రకారం చూస్తే, పూరి జగన్నాథ్‌ ‘జన గన మన’ సినిమాని పాన్‌ ఇండియా ఫిలిమ్‌గా ప్లాన్‌ చేశాడనీ, ఈ క్రమంలోనే కన్నడ హీరో యష్‌ని పూరి ఇటీవల సంప్రదించాడనీ తెలుస్తోంది. ‘జన గన మన’ కాన్సెప్ట్‌ని గతంలోనే పూరి, యష్‌కి విన్పించాడనీ, ఫుల్‌ స్క్రిప్ట్‌తో వస్తే సినిమా చేద్దామంటూ యష్‌ చెప్పాడనీ, కన్నడలో ఆల్రెడీ సినిమాలు తీసిన అనుభవం పూరికి వుండడంతో, యష్‌ కూడా పూరితో వర్క్‌ చేయడానికి ఆసక్తిగా వున్నాడనీ సమాచారమ్‌.

అన్నీ కుదిరితే, 2020లో పూరి – యష్‌ల సినిమా తెరకెక్కొచ్చు. అయితే, ఈ విషయమై పూరి జగన్నాథ్‌ కొంచెం ‘లో-ప్రొఫైల్‌’ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. కానీ, పూరి – యష్‌ ఈ మధ్యనే ఇంకోసారి ‘జన గన మన’ కోసం భేటీ అయ్యారంటూ కన్నడ సినీ మీడియాలో కథనాలు గుప్పుమనడంతో, వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన ఈ ప్రాజెక్ట్‌పై చేయాలని పూరి భావిస్తున్నాడని తెలుస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...