Switch to English

పో..తిన మహేష్.! పవన్ కళ్యాణ్ చేసిందే కరెక్ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ వెస్ట్ అనేది జనసేన పార్టీకి అత్యంత కీలకం.. అని నిన్న మొన్నటిదాకా జనసైనికులు భావించారు. అది నిజం కూడా.! విజయవాడ వెస్ట్‌లో జనసేన పార్టీ చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తూ వచ్చింది.

పోతిన మహేష్ నాయకత్వంలో జనసేన పార్టీ, చాలా అగ్రెసివ్‌గా అధికార వైసీపీ మీద పోరాడిన మాట వాస్తవం. టీడీపీతో కూడా అదే స్థాయిలో రాజకీయ పోరాటం చేసింది జనసేన పార్టీ.. అది 2019 ఎన్నికల సమయంలో.
ఆ పోతిన మహేష్, జనసేన పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఆశించారు.. కానీ, భంగపడాల్సి వచ్చింది. పోతిన మహేష్‌కి టిక్కెట్ ఇచ్చి వుండాల్సిందంటూ జనసైనికులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సోషల్ మీడియా వేదికగా చాలా చాలా రిక్వెస్టులు పెట్టారు. కానీ, వ్యవహారం ఎక్కడో తేడా కొట్టింది.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గం జనసేనకు కాకుండా బీజేపీకి వెళ్ళింది.. పొత్తులో భాగంగా. నిజంగానే ఇది పెద్ద ట్విస్ట్.! మామూలుగా అయితే, జనసేనాని ఆ టిక్కెట్ కోసం గట్టిగానే పట్టుబట్టి వుండేవారు. గతంలో, అంటే 2019 ఎన్నికల్లో అలాగే పట్టుబట్టి, వామపక్షాలకు ఆ టిక్కెట్ పొత్తులో వెళ్ళకుండా, జనసేన తరఫున పోతిన మహేష్‌ని నిలబెట్టారు కూడా. కానీ, పోతిన మహేష్ ఓడిపోయారు.

ఇక, ప్రస్తుతానికి వస్తే, జనసేనను వీడారు పోతిన మహేష్. టిక్కెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించి, పార్టీకి గుడ్ బై చెప్పేశారాయన. రాజకీయాలన్నాక నాయకులు పార్టీల్ని వీడటం అనేది సర్వసాధారణం. టిక్కెట్ దక్కలేదన్న కారణంగా, పార్టీ మీద బురద చల్లటమూ మామూలే.
అయితే, రాత్రికి రాత్రి ఇలా ఎలా మారిపోయాడు పోతిన మహేష్.? అని జనసైనికులు షాక్ గురయ్యేంతలా, వైసీపీ మార్కు ప్రెస్ మీట్ పెట్టారు పోతిన మహేష్.. పార్టీని వీడుతూ. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవా గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారాయన. పిఠాపురంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మీ భార్య అన్నా లెజినెవాని తీసుకురావాలంటూ చిత్ర విచిత్రమైన కోరిక కోరారు పోతిన మహేష్.

ఇది వైసీపీ మార్కు స్క్రిప్ట్.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కేవలం వైసీపీ నాయకులు మాత్రమే, ఇదిగో ఇలా రాజకీయ ప్రత్యర్థుల భార్యల గురించి రాజకీయ విమర్శలు చేస్తుంటారు. ఔను, పవన్ కళ్యాణ్ చేసిందే కరెక్ట్.! పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పుకుని, పవన్ కళ్యాణ్ భావ జాలం పట్ల ఆకర్షితుడినయ్యానని చెప్పుకుని.. ఇదిగో, ఇలా పవన్ కళ్యాణ్ భార్య మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటే, పోతిన మహేష్‌ని ఏమనాలి.?

గెలిచాక వైసీపీలోకి దూకెయ్యాలనుకున్నాడో ఏమోగానీ.. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కి ముందే తెలిసిందేమోగానీ.. పోతిన మహేష్‌ విషయంలో పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అనుకోవాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...