కాఫీ తాగలేదు గనుక, మైండ్ సరిగ్గా లేదట.! అందుకని, ప్రియాంకతో వాదన పెట్టుకోలేదట శివాజీ.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో ఓకింత కాంప్లికేటెడ్ కంటెస్టెంట్ ఎవరన్నా వున్నారంటే శివాజీనే.
హోస్ట్ అక్కినేని నాగార్జున పర్సనల్ కోటాలో శివాజీ, ఈ సీజన్ కంటెస్టెంట్ అయ్యాడనే ప్రచారం వుంది. శివాజీ ఏం చేసినా, నాగార్జున వెనకేసుకురావడం చూస్తున్నాం. భుజం సమస్యతో బాధపడుతున్న శివాజీని, బలవంతంగా ఇన్ని రోజులు హౌస్‌లో వుంచారు.
ఒకప్పుడు సినీ నటుడిగా శివాజీ చెప్పుకోదగ్గ పేరు ప్రఖ్యాతులే సంపాదించుకున్నాడు. రాజకీయ తెరపైనా శివాజీ హల్ చల్ చేశాడు. గరుడ పురాణం.. అంటూ శివాజీ చేసిన రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ న్యూస్ ఛానల్ వివాదంలోనూ శివాజీ పేరు మార్మోగిపోయింది.
బిగ్ హౌస్‌లో మాత్రం శివాజీ అత్యంత సౌమ్యుడు.. మిగతా కంటెస్టెంట్లకు పెద్దన్న. అందులోనూ కొందరు కంటెస్టెంట్లకు అత్యంత సన్నిహితుడు. ఇంకొందరు కంటెస్టెంట్లకు విలన్ కూడా.!
కాఫీ అలవాటు చాలామందికి వుంటుంది. కొందరికి టీ అలవాటు వుంటుంది. ఇవేవీ వ్యసనాలు కావు. వ్యసనమంటే స్మోకింగ్ చేయకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం.. లాంటిది. మద్యం, డ్రగ్స్ విషయంలో వ్యసనపరులు ఎలా వ్యవహరిస్తారో తెలిసిందే కదా.!
కాఫీకి అలవాటు పడితే శివాజీలా ఎవరైనా ఇబ్బంది పడతారా.? ఛాన్సే లేదు. బిగ్ హౌస్‌లో కాఫీ దొరకదా.? ఇది మరీ కామెడీ.! ఇంత కామెడీ శివాజీ చుట్టూ నడుస్తోంటే, బిగ్ బాస్ టైటిల్ ఆయన చేతుల్లో పెట్టేయడం ముందే ఫిక్సయిపోయిందన్నమాట.
మరి, మిగతా కంటెస్టెంట్లతో హైడ్రామా ఎందుకు.? అదే బిగ్ బాస్ మ్యాజిక్.!