తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. తన కుమారుడ్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు అనుకుంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప.. ఇంకో ఛాన్స్ లేదు. వైఎస్ జగన్ జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఆయన సతీమణి భారతి ముఖ్యమంత్రి పీఠమెక్కుతారనే ప్రచారం చాన్నాళ్ళుగా జరుగుతోంది.
ఇంతేనా.? రాజకీయమంటే ఇంకేమీ లేదా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత అయినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రాదా.? అయితే ‘కమ్మ’ లేదంటే ‘రెడ్డి’ తప్ప మరో సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదా.? అన్న ఆవేదన ఆయా సామాజిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రముఖులు ఇటీవల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోగా, అక్కడా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, తమ తమ పార్టీల ఎజెండాలకు తగ్గట్టుగానే వ్యవహరించారు. చిత్రమేంటంటే, చాలామంది కాపు సామాజిక వర్గ నేతలు, తమ సామాజిక వర్గానికి అధికారం దక్కాలన్న ఆలోచన కంటే, తమ తమ పార్టీలకు ఎలా మేలు చేయాలన్నదానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారట.
‘మేమంతే, మాకు మేమే శతృవులం. మమ్మల్ని మేమే తొక్కేసుకుంటాం. ఇంకెవరికన్నా మేం మద్దతిస్తాంగానీ, మాకు మేం మద్దతిచ్చుకోం..’ అంటూ వైసీపీకి చెందిన ఓ ‘కాపు’ ప్రజా ప్రతినిథి ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో నోరు జారేశారు. వైసీపీకి కొమ్ముకాసే ఆ ఛానల్, ‘కాపు’ సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టే క్రమంలోనే ఆ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు సంధిస్తున్న ‘కమ్మటి’ వలపు బాణాలు, వైసీపీ ‘రెడ్డి’ రాజకీయం.. గురించిన చర్చ జోరుగా