Switch to English

ఏవండోయ్ నానిగారూ.! ‘ప్రైవేటు’ దోపిడీపై ఉక్కుపాదం మోపరేం.?

మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు దంచేస్తున్నారు.

సినిమా టిక్కెట్ల సంగతిని పక్కన పెడదాం. బస్సు ఛార్జీల సంగతేంటి.? తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నా, సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అలా కాదు.. ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు దోపిడీకి తెరలేపింది. బస్సు ఛార్జీలపై 50 శాతం అదనం.. అనే సూత్రాన్ని పాటిస్తోంది.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ప్రభుత్వ పెద్దల తీరు.. అనడానికి నిదర్శనమిదేనంటూ ఆర్టీసీ బస్సు ప్రయాణీకులు ఉస్సూరుమంటున్నారు. ఏపీఎస్ఆర్‌టీసీకి ‘నై’.. తెలంగాణ ఆర్టీసీకి జై.. అంటున్నారు ఏపీకి చెందిన ప్రయాణీకులు కూడా.

ఆర్టీసీ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. రవాణా శాఖ మంత్రిగారికి, పండగ పేరుతో ప్రైవేటు బస్సుల దోపిడీ కనిపించకపోవడం శోచనీయం. వినోదాన్ని సామాన్యుడికి అందుబాటు ధరలో ఇవ్వడం సబబేగానీ, ప్రయాణీకులకు అందుబాటు ధరలో ప్రయాణ సౌకర్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత కాకపోతే ఎలా.?

ఆర్టీసీ అదనపు బాదుడు 50 శాతం అయితే, ప్రైవేటు దోపిడీ 100 శాతం, ఆపైన.. అంటే అవసరాన్ని బట్టి రెండొందలు, మూడొందల శాతం కూడా పెరిగిపోతోంది. మరి, వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు.? ఇంకేం చేస్తాయి, నిద్రపోతున్నాయ్. అసలు ఈ విషయమై రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలేమిటో మంత్రివర్యులు చెప్పరాయె.

సినిమా టిక్కెట్టుది ఏముంది మహా అయితే.. ఓ యాభై లేదంటే వంద రూపాయలు అదనం. మరీ గట్టిగా అంటే ఓ రెండొందల రూపాయల వరకు అదనం వుంటుందేమో. బస్సు ఛార్జీలు అలా కాదు కదా.! దూరాన్ని బట్టి అదనంగా వెయ్యి రూపాయల నుంచి ఐదారు వేల రూపాయల వరకు దోపిడీ జరుగుతోంది.

ముందు నుంచి చీమలు కూడా వెళ్ళకూడదు, వెనకాల నుంచి ఏనుగులు పారిపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే, ఏనుగుల వెనుక రాజకీయం వ్యవహారాలుంటాయ్ మరి.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

‘రాజ్ కహానీ’ ఫస్ట్ లుక్

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

రాజకీయం

ఇది గుజరాత్ కాదు.. పోరుగడ్డ తెలంగాణ మోదీ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ కలలు కంటున్నారని.. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన...

మార్పు తథ్యం.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు: సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ,...

జనసేనాని ప్రశ్న స్పష్టం: వైసీపీ వద్ద సమాధానం లేని వైనం.!

కోడి కత్తి కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది ఎన్ఐఏ.. అది జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో వుంది గనుక.....

తెలంగాణ: కుటుంబ పాలన నుంచి బీజేపీకి అధికారం ఖాయం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ...

జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి.. ప్రభుత్వాన్ని నడపలేరు: చంద్రబాబు

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడుకు వెళ్తూ చిలకలూరిపేట చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమలాపురంలో పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై...

ఎక్కువ చదివినవి

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనుండగా యువసుధ...

సజ్జల కామెడీ.! ‘దిశ’ చట్టం బాధ్యత జనసేనాని పవన్ తీసుకోవాలా.?

‘దిశ చట్టానికి ఆమోదం లభించడంలేదు కేంద్రం నుంచి. మీ మిత్రుడు బీజేపీతో చెప్పి చేయించండి..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఉచిత...

పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్..

ఏపీలో సంచలనం రేపిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

మార్పు తథ్యం.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు: సీఎం కేసీఆర్

దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తన పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ,...