Switch to English

టీవీ 9 రగడ: నాగబాబు రియాక్షన్‌ అదిరింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమయంలో ఓ సెక్షన్‌ మీడియా ఆయన మీద కక్ష కట్టేసింది. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభూత కల్పనలతో అనేక కథనాల్ని సదరు మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించాక, ఆ పార్టీకి వ్యతిరేకంగా మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఆనాటి ఆ పరిస్థితుల్ని తలచుకుంటూ సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగాబ్రదర్‌ నాగబాబు కొంత ఎమోషనల్‌ అయ్యారు.

టీవీ 9 సంస్థలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు, నాగబాబు చాలా హుందాగా వ్యవహరించారు. ఎక్కడా ఆ సంస్థ పేరు ప్రస్తావించకుండా, మీడియా పరంగా తమకు అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్ళి వ్యవహారంలో మీడియా వ్యవహరించిన తీరు గురించి అందరికీ తెలుసు. ఆ ఘటనతో చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. అయినా మీడియా, కనీస విజ్ఞత పాటించని పరిస్థితుల్ని నాగబాబు గుర్తు చేసుకున్నారు.

‘అప్పుడే కాదు, ఇప్పుడూ మీడియా మా మీద దుష్ప్రచారం చేస్తూనే వుంది. అందుకే నేను ఫోర్త్‌ ఎస్టేట్‌ని పెద్దగా ఇష్టపడను. ఫిఫ్త్‌ ఎస్టేట్‌ ఒకటి వచ్చింది కదా. అదే, జనసేన పార్టీకి అండగా నిలిచింది. ఆ ఫిఫ్త్‌ ఎస్టేట్‌ లేకపోయి వుంటే పరిస్థితి ఎలా వుండేదో ఏమో’ అని సోషల్‌ మీడియా గురించి నాగబాబు చెబుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. నాగబాబు, జనసేన పార్టీలో చేరే ముందు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేసిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణకి వ్యతిరేకంగా తొలుత వీడియోలు పోస్ట్‌ చేసిన నాగబాబు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీపైనా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైనా విరుచుకుపడ్డారు.

ఇదిలా వుంటే, జనసేన పార్టీకి గత కొంతకాలంగా సోషల్‌ మీడియా అండగా వుంటూ వస్తోంది. సోషల్‌ మీడియాలో పవన్‌కళ్యాణ్‌ మద్దతుదారులు, సామాన్యులు జనసేనకు మద్దతుగా నిలిచారు. జనసేనపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో జనసేన సానుభూతిపరులు ఖండిస్తూ వచ్చారు, వాస్తవాల్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు. నిజానికి, జనసేన పార్టీకి ఈ స్థాయిలో సోషల్‌ మీడియాలో మద్దతు దొరుకుతుందని బహుశా ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా ఊహించి వుండరు.

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు మీడియా, చిరంజీవి వార్తలతో పండగ చేసుకుంది. అయితే అవి చిరంజీవిని కీర్తించేలా వుండేవి. ఎప్పుడైతే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారో, చిరంజీవిపై లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు చూపించి రోడ్డుకీడ్చేందుకు ప్రయత్నించింది మీడియాలో ఓ సెక్షన్‌. ఇది ఆయా రాజకీయ పార్టీల ప్రోద్బలంతో జరిగిందే. జనసేన విషయంలోనూ అదే స్ట్రాటజీని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలతో కలిసి అమలు చేయడానికి ప్రయత్నించినా, సోషల్‌ మీడియా కారణంగా ఆ పప్పులుడకలేదు. అదే విషయం నాగబాబు మాటల్లో స్పష్టమయ్యింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...